సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తాంతాడేపల్లి- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రకార్యాలయం.(ప్రజా అమరావతి);*సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో సమావేశమైన పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్,రాజ్యసభసభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి...*


*-2024లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదే అధికారం*


*-సోషల్ మీడియా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు.. వారికి తగిన గుర్తింపు ఇస్తాం.**-జులై 8 వతేదీన పార్టీ ప్లీనరీ జరుగుతుంది.*


*-పార్టీ కార్యాలయంలో హెల్ప్ లైన్*


*-సోషల్ మీడియా కార్యకర్తల సేవలను మరింతగా వినియోగించుకుంటాం.*


*-సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరిస్తాం.*


*-పార్టీ సమావేశాలలో వారిని తప్పనిసరిగా ఆహ్వానించేలా ఆదేశాలు ఇస్తాం.*


*- సభ్యత్వ నమోదు ఇతర రాజకీయపక్షాలన్నింటికంటే అత్యధికంగా జరగాలి.*


*-సోషల్ మీడియా పోస్టులలో వ్యక్తిగత దూషణలు వద్దు..సెటైరికల్ గా పోస్టులు ఉండాలి.*


*-సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్,రాజ్యసభసభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి.*


        వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సోషల్ మీడియా కార్యకర్తల పాత్ర కీలకమైనదని, వారికి తగిన విధంగా గుర్తింపు ఇచ్చి ప్రోత్సహిస్తామని పార్టీ అనుబంధ విభాగాల ఇన్ ఛార్జ్,రాజ్యసభసభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి అన్నారు.


 తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నాడు పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. సమావేశంలో విజయసాయిరెడ్డి గారు ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు.  


సోషల్ మీడియా కార్యకర్తలతో దాదాపు మూడు గంటలపాటు సమావేశమై వారి అభిప్రాయాలను సావధానంగా విన్నారు.


"-తాము ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నాయకత్వంలో అంకితభావంతో పనిచేశామని, కోఆర్డినేటర్లందరికి తగిన విధంగా గుర్తింపు ఇవ్వాలని" వారు కోరారు. దాదాపు 31 మంది నియోజకవర్గ కోఆర్డినేటర్లు వివిధ అంశాలపై లేవనెత్తిన పలు సమస్యలను స్వయంగా విజయసాయిరెడ్డి నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత వాటన్నింటికి సమాధానాలు ఇచ్చారు. 


ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తనకు ఆదేశాలు ఇచ్చారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు లేవనెత్తిన అంశాలను పరిష్కరించడం జరుగుతుందన్నారు.


            విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ.. సోషల్ మీడియా కార్యకర్తలు ఏ విధంగా పార్టీకి సేవకులో తాను కూడా అదేవిధంగా పార్టీకి సేవకుడ్నేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాకు సంబందించి నామినేటెడ్ పోస్టులలో  కొంతమందిని తీసుకోవడం జరిగిందన్నారు. వారికి తగిన గుర్తింపు ఇచ్చి వారి సేవలను మరింత విస్తృత స్దాయిలో వినియోగించుకుంటామని వివరించారు. 


రాష్ర్టంలో  26 జిల్లాలు చేసుకోబోతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ని మండలాలు, నగరాలలోని డివిజన్లు,వార్డులు అన్నీ  ఉంటాయి. ప్రతి మండలానికి ప్రతి వార్డుకు,ప్రతి పార్లమెంట్ జిల్లాకు సోషల్ మీడియా ఇన్ ఛార్జ్ ను తీసుకోవాలని నిర్ణయించామన్నారు.
        విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ కాబోతుంది. మన పార్టీ స్టాండ్ అదే. అక్కడ ప్రతి సామాజిక వర్గానికి సంబంధించి ప్రతి కార్పోరేషన్ కు 500 గజాల నుంచి వేయి గజాల వరకు స్దలం ఇవ్వాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ నిర్ణయించారన్నారు. మౌళికసదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.తగిన నిధులు ఆయా కార్పోరేషన్లకు కేటాయిస్తారన్నారు.

       సోషల్ మీడియా కార్యకర్తలు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చురుకుగా వ్యవహరించి, తెలుగుదేశం పార్టీ చేస్తున్న అన్యాయాలను,చంద్రబాబు దురాగతాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి పార్టీని ప్రజలకు చేరువ చేశారన్నారు.  సోషల్ మీడియా కార్యకర్తలు అడిగిన విధంగా వారికి ప్రత్యేకంగా యాప్ ను రూపొందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా అయితే సభ్యత్వ కార్డులు ఉంటాయో,వారికి సైతం అదే సభ్యత్వ కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. 


*జులై 8 వతేదీన పార్టీ ప్లీనరీ*


జులై 8 వతేదీన పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుపుకుంటున్నాం. ఆ తర్వాత అధ్యక్షుడి ఆదేశాలమేరకు పార్టీకి సంబంధించిన రాష్ర్ట,జిల్లా,గ్రామస్దాయి కమిటీల వరకు పునర్ నిర్మాణం జరుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు గతంలో ప్రతిపక్షంలో ఉండగా సాధారణ స్థాయిలో జరిగిందని,ఇప్పుడు ఇతర రాజకీయపక్షాల కంటే అత్యధికస్ధాయిలో సభ్యత్వ నమోదు చేయాల్సి ఉంటుందని వివరించారు. కార్యకర్తలు ప్రస్తావించిన విధంగా సభ్యత్వం తీసుకున్నవారికి ఇన్సూరెన్స్ అనేది పార్టీ అధ్యక్షునితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియచేశారు.

        సభ్యత్వ నమోదు తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి వివరాలు జిల్లా కమిటీలకు,ఎంఎల్ఏ లకు,స్దానిక నాయకత్వాలకు పంపిస్తామని,ప్రోటోకాల్ ప్రకారం ఏ సమావేశాలు జరిగినా వారిని తప్పనిసరిగా పిలిచేవిధంగా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.


 జిల్లాలవారీగా సోషల్ మీడియా కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియచేశారు. ఇదే సమయంలో కార్యకర్తలు ప్రస్తావించిన సమస్యలను పరిష్కరించి పార్టీని విజయానికి చేరువచేయాలనేది తమ ఉధ్దేశ్యం అన్నారు.         పోస్టింగ్ లు పెడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వారు బెదిరిస్తున్నారని, తాము  అధికారంలోకి వస్తే మీపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారనే అంశం తన దృష్టికి వచ్చిందన్నారు. వారందరికి ఒకటే చెబుతున్నాను...


 2024లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  తిరిగి అధికారంలోకి రానుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

 ఎస్సిఎస్టి,బిసి,మైనారిటీలకు సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు.

 పార్టీలకు,కుల,మతాలు,ప్రాంతాలకు అతీతంగా వారికి పథకాలు అందిస్తున్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం న్యాయం చేశారు. అనేక ప్రయోజనాలు చేకూర్చారు. ఇవన్నీ కూడా మన పార్టీని మరో 30 సంవత్సరాలు అధికారంలో ఉండేలా చేస్తాయి. అపనమ్మకం ఏమాత్రం అవసరం లేదు. వ్యక్తిగత దూషణలకు వెళ్లాల్సిన అవసరం లేదు. చంద్రబాబు,లోకేష్ లను గాని,తెలుగుదేశం పార్టీ నేతలను కాని సెటైరికల్ గా విమర్శలు చేయవచ్చని అన్నారు. అలా పోస్టింగ్స్ పెట్టినప్పుడు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.కేసులు సైతం పెట్టలేరన్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను టార్గెట్ చేయాలే కాని ఎగ్జిక్యూటివ్స్ ను గాని,జ్యూడిషయరీని కాని టచ్ చేయాల్సిన అవసరం లేదన్నారు. అలాంటప్పుడు మనపై ఎవ్వరూ కూడా కేసులు పెట్టే అవకాశం లేదన్నారు. రాజకీయాలకు సంబంధించి మాత్రమే పరమితమైతే సరిపోతుందన్నారు. గతంలో మన సోషల్ మీడియాకార్యకర్తలపై ఏవైతే కేసులు ఉన్నాయో వాటిపై తగిన విధంగా స్పందించడం జరుగుతుందన్నారు. 

             ప్రజాస్వామ్యపద్దతిలోనే మన పోరాటం సాగుతుందన్నారు. వ్యక్తిగత దూషణలు అవసరం లేదన్నారు. ఇకపై కార్యకర్తలకు మరింత సమయం కేటాయిస్తానని వివరించారు. 


పార్టీ కార్యాలయంలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలకు ఎటువంటి సహాయం కావాలన్నా కూడా వారికి అందించడం జరుగుతుందన్నారు.  పార్టీని నమ్ముకుని మనల్ని గెలిపించిన వారికి మేలు చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేయాలనేది తన ఉధ్దేశ్యం అన్నారు.


 గ్రీవెన్స్ సెల్ కూడా తగిన విధంగా ఎఫెక్టివ్ గా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


            కేంద్రకార్యాలయం పర్యవేక్షకులు,శాసనమండలి సభ్యులు శ్రీ లేేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీకోసం విజయసాయిరెడ్డి ఎంతో తపన,తాపత్రయపడుతుంటారన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆలస్యం జరుగుతుందేమో కాని తప్పనిసరిగా గుర్తింపు లభించి తీరుతుందని అన్నారు. పార్టీ లో ఎవరికీ అన్యాయం జరగదని ప్రతి సోషల్ మీడియా కార్యకర్త ఈ అంశాన్ని గుర్తించాలన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు   తగిన గుర్తింపు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొెందించారన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందనే అంశం గుర్తుంచుకోవాలన్నారు.


 సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు.


 సమావేశంలో శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు.

Comments
Popular posts
రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలి:
Image
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
వీఆర్వో లు రెవెన్యూ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం,(ప్రజాఅమరావతి ): ఆగస్టు 27: నూతనంగా పదోన్నతులు పొందిన గ్రామ రెవెన్యూ అధికారులు చట్టాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. గురువారం నూతనంగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు 2వ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో విఆర్వోలు అంతా మెరుగ్గా పనిచేసి ప్రభుత్వ లక్ష్యసాధనకు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని అనుభవజ్ఞులైన సీనియర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు వీఆర్వో లు నాలుగు విభాగాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో రెవెన్యూ భూ రికార్డులు, సామాజిక సంక్షేమం, అభివృద్ధి, పోలీసు తదితర విభాగాల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. రెవెన్యూ కు సంబంధించి అన్ని గ్రామ అకౌంట్లు, భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. నీటి పన్ను సెస్ తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వసూళ్లు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ భూములను తనిఖీ చేయాలన్నారు. సర్వే రాళ్లను ప్రతి ఏటా రెండు సార్లు పరిశీలించాలని, రాళ్లు లేనిచోట ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు, చెట్లు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత విఆర్ఓ లపై ఉంటుందన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాల్సి వస్తే ఆ ఆస్తుల వివరాలు అందించి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే పోలీసు విధులకు సంబంధించి రెవెన్యూ అధికారులు మెజిస్ట్రేట్ అధికారాలు వినియోగించే సమయంలో వీఆర్వోలు సహాయకులుగా పనిచేయాలని, ఎలాంటి అనుమానిత సమాచారాలు తెలిసినా వాటిని పోలీసులకు అందించాల్సి ఉంటుందన్నారు. నేరాలు జరిగిన సమయంలో ఆధారాలతో వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. సామాజిక సంక్షేమం, అభివృద్ధి, విధులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అంటరానితనం నిర్మూలనలో బాధ్యతగా పని చేయాలని, పౌరసరఫరాల విషయంలో అధికారులకు సహకారం అందించాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టం అంచనా కు సంబంధించి వ్యవసాయ అధికారులకు సహకారం అందించాలన్నారు. తహశీల్దార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు విధులను వీఆర్వోలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అలాగే గ్రామాలలో అవసరమైన సమాచారాన్ని ప్రజలందరికీ చేరువుగా తీసుకువెళ్ళే క్రమంలో దండోరా వేయించడం, లీగల్ నోటీసులు జారీ ప్రక్రియ లాంటి విధులు కూడా వీఆర్వోల పరిధిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆయా గ్రామ సచివాలయంలో పనిచేసే విఆర్వోలు ముందస్తుగా చట్టాలపై అవగాహన చేసుకొని జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. వీఆర్వోల విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిఆర్ఓ గాయత్రీ దేవి, హ్యాండ్ సెట్ సీఈవో హరి ప్రసాద్, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, తహసిల్దార్ లు విశ్వనాథ్, నాగరాజు, హరి కుమార్, డి టి శ్రీధర్, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం డివిజన్ నుండి 111 మంది పదోన్నతులు పొందిన విఆర్వోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు..