మహిళా సాధికారతలో ఏపీ నెంబర్‌ వన్‌

 


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియమ్‌లో ‘మహిళా సాధికారత–జగనన్న లక్ష్యం’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:


*మహిళా సాధికారతలో ఏపీ నెంబర్‌ వన్‌*



*సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాల్లో మనమే మేటి*

*మహిళాభ్యుదయమే ప్రభుత్వ లక్ష్యం*

*దానికి కట్టుబడే అడుగులు ముందుకు వేస్తున్నాం*

*దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు సాధికారత*

*రాజకీయంగానూ, ఆర్థికంగానూ వారికి కొండంత భరోసా*

*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటన*


*నామినేటెడ్‌ పదువుల్లో మహిళలకు 50 శాతానికి పైగా*

*నామినేషన్‌ పనుల్లోనూ వారికి 50 శాతం కేటాయింపు*

*ఆ మేరకు ప్రత్యేకంగా చట్టాలు చేసిన ప్రభుత్వం*

*మరే రాష్ట్రంలోనూ లేని విధంగా మహిళలకు పథకాలు*

*నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ*

*పరోక్షంగానూ వారికి పలు పథకాల వల్ల లబ్ధి*

*34 నెలల కాలంలో ప్రభుత్వం అందించిన సహాయం*

*డీబీటీ, నాన్‌ డీబీటీల ద్వారా రూ.1.18 లక్షల కోట్లు* 

*సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ వెల్లడి*


*అక్కచెల్లెమ్మల రక్షణ కోసం దిశ చట్టం, యాప్‌ రూపకల్పన*

*ఇప్పటి వరకు దిశ యాప్‌ 1.13 కోట్ల డౌన్‌లోడ్స్‌*

*అక్కచెల్లెమ్మల చేతిలో దిశ యాప్‌  ఒక బ్రహ్మాస్త్రం*

*మరో అస్త్రం సచివాలయాల్లో మహిళా పోలీస్‌*

*ఇది ఒక విప్లవాత్మక మార్పు*

*ప్రతి జిల్లాలో దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు*

*రూ.87 కోట్ల వ్యయం. సిబ్బందీ నియామకం*

*కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌* 


విజయవాడ (ప్రజా అమరావతి);


*కార్యక్రమంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం:*


*మన మహిళలకు దక్కిన గౌరవం:*

ఈరోజు ఇక్కడ మహిళా ప్రపంచాన్ని చూస్తుంటే, మహిళా సాధికారతకు అర్ధం చెబుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క చెల్లెమ్మకు, ఇక్కడికి రాలేకపోయిన అందరు అక్కచెల్లెమ్మలకు మీ అన్న, మీ తమ్ముడు జగన్‌ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాడు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌కు మన సమాజంలో, మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి ఈరోజు ఇక్కడ ఉన్న నా అక్క చెల్లెమ్మలు అందరూ ప్రతినిధులు. ఎక్కడైనా ఏ సభలో చూసినా నాయకులు స్టేజ్‌ మీద ఉంటే ప్రజలు కింద ఉంటారు. కానీ ఇవాళ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే, ఇటు స్టేజ్‌ మీద, అటు స్టేడియమ్‌ నిండా ఈ వేల మందిలో ప్రతి ఒక్కరూ ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరు ఎంపవర్డ్‌ ఉమెన్‌. ప్రతి ఒక్కరు సాధికారతకు ప్రతినిధులుగా నిలుస్తున్నారు. 


*ఆమె మాటలు గుర్తుకొస్తున్నాయి:*

మీలో ఉన్న ఆత్మ విశ్వాసాన్ని చూస్తుంటే అయిన్‌ రైన్డ్‌ అనే మహిళ ∙మాటలు గుర్తుకు వస్తున్నాయి. 

‘నేను ఒక స్త్రీని కాబట్టి, నన్ను ఎవరు ఎదగనిస్తారన్నది ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం ఉన్న నన్ను ఎవరు ఆపగలుగుతారు అన్నది ప్రశ్న’.. నిజంగా ఆమె చెప్పిన మాటలు, ఆ అర్ధం ఈరోజు ఇక్కడ కనిపిస్తోంది.

అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రతి ఆడబిడ్డలోనూ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతి మహిళలోనూ ఇటువంటి ఆత్మవిశ్వాసం ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో నిదర్శనంలా కనిపిస్తోంది. 


*ఇంత మంది ప్రజా ప్రతినిధులు:*

నా ఎదురుగా ఉన్న ఈ అక్కచెల్లెమ్మల్లో దాదాపు 99 శాతం మంది వార్డు మెంబర్లుగానో, సర్పంచ్‌లుగానో, ఎంపీటీసీ, జడ్పీటీసీలుగానో, మున్సిపల్‌ కౌన్సిలర్లుగానో, మున్సిపల్‌ ఛైర్మన్లుగానో, కార్పొరేటర్లుగానో, మేయర్లుగానో లేదా ఏదో ఒక కార్పొరేషన్‌ ఛైర్మన్‌గానో, డైరెక్టర్‌గానో ఉన్నారు.

ఇంకా నా మంత్రివర్గ సహచరులైన అక్కచెల్లెమ్మలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్‌పర్సన్లు, మహిళా కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు. బహుషా దేశ చరిత్రలో ఇటువంటి సమావేశం ఎప్పుడూ, ఎక్కడా జరిగి ఉండదని గర్వంగా చెబతున్నాను.


*ఇంటింటా చెప్పండి:*

ఇది మన ఆధ్వర్యంలో, మన ప్రభుత్వంలో జరుగుతుంది అంటే, ఇదంతా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో జరుగుతుందని తెలియజేస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో లభించిన ఈ అధికారాన్ని అక్కచెల్లెమ్మల కోసం ఎలా ఉపయోగించామో, ఎలా అడుగులు వేశామో క్లుప్తంగా ఇవాళ మీ ముందు ఉంచుతున్నాను.

ఈ నిజాలు, సందేశాన్ని గ్రామ గ్రామాన, ప్రతి నగరంలో ప్రతి ఇంట్లో చెప్పాలని సవినయంగా కోరుతున్నాను.


*రాజకీయ సాధికారత:*

రాజకీయ సాధికారత పరంగా మనం ఏం చేశామో మీ ముందుంచుతున్నాను. మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని చెప్పి 1993 నుంచి పార్లమెంటులో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే ఏ డిమాండ్లు లేకపోయినా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ విధానంలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం ఇచ్చేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నాను.

నామినేటెడ్‌ పదవుల్లో 51 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం మనదే. మొత్తం 1,154 డైరెక్టర్‌ పదవుల్లో అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన çపదవులు 586 అని గర్వంగా చెబుతున్నాను. 202 మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ పదవుల్లో 102 మహిళలకే ఇచ్చాం. అంటే మొత్తంగా 1356 రాజకీయ నియామక పదవుల్లో 688, అంటే అక్షరాలా 51 శాతం అక్కచెలెక్లమ్మలకు కేటాయించాం.

అంతే కాకుండా మనం ఇచ్చిన పదవులు చూస్తే, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా శాసనమండలి వైస్‌ ఛైర్మన్‌గా నా సోదరి జకియాఖాన్‌ను నియమించాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నా మరో సోదరి, ఎస్టీ మహిళ పుష్పశ్రీవాణిని, రాష్ట్ర హోం మంత్రిగా నా మరో దళిత సోదరి సుచరితను నియమించాం. రాష్ట్ర తొలి చీఫ్‌ సెక్రటరీగానూ, ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నా సోదరి నీలం సాహ్నిని నియమించాం.

జడ్పీ ఛైర్మన్లు.. ఆ 13 పదవుల్లో 7గురు నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. అంటే అక్షరాలా 54 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. 26 జడ్పీ వైస్‌ఛైర్మన్‌ పదవుల్లో 15 మంది, అంటే 58 శాతం నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. ఇంకా 12 మేయర్‌ పోస్టులు, 24 డిప్యూటీ మేయర్‌ పదవులు.. మొత్తంగా 36 పదవుల్లో.. 18 అంటే 50 శాతం అక్కచెల్లెమ్మలే ఉన్నారు. మొత్తం మున్సిపల్‌ కార్పొరేషన్లలో వార్డు మెంబర్లు 671 అయితే, వారిలో అక్కచెల్లెమ్మలకు 54 శాతం అంటే, 361 పదవులు దక్కాయి.

ఇటీవల 75 మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే వాటిలో 73 చోట్ల వైయస్సార్‌సీపీ విజయం సాధించింది. వాటిలో అక్షరాలా 45 మంది, అంటే 64 శాతం నా అక్కచెల్లెమ్మలే ఛైర్‌పర్సన్లుగా ఉన్నారు. ఇంకా 2,123 వార్డు మెంబర్లలో 1,161 మంది, అంటే 55 శాతం నా అక్కచెల్లెమ్మలకే దక్కేట్లు చేశామని గర్వంగా చెబుతున్నాను.

సర్పంచ్‌ పదవుల్లో 57 శాతం, ఎంపీటీసీల్లో 54 శాతం, మండల అధ్యక్షుల్లో 53 శాతం, జడ్పీటీసీల్లో 53 శాతం నా అక్కచెల్లెమ్మలకే దక్కేలా చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా చెబుతున్నాను.


*సచివాలయాలు–వలంటీర్లు:*

మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన దాదాపు 2.60 లక్షల  వలంటీర్‌ ఉద్యోగాల్లో 53 శాతం నా చెల్లెళ్లు ఉన్నారు. ఇంకా దాదాపు 1.30 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తుండగా, వారిలో 51 శాతం నా చెల్లెమ్మలు ఉన్నారు. దేశంలో 28 రాష్ట్రాల చరిత్రలో మనకు సరిసమానంగా ఆడపడుచులను బలపర్చిన ప్రభుత్వం ఒక్కటి కూడా లేదు.


*పథకాలు–అక్కచెల్లెమ్మలు:*

ఈ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఉందో లేదో మీరే చెప్పాలి.

*అమ్మ ఒడి:*

దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో అయిన తమ పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు రూ.15 వేలు ఇచ్చే జగనన్న అమ్మ ఒడి ఉందా? ఇక్కడ 44.50 లక్షల అక్కచెల్లెమ్మలకు ఈ రెండేళ్లలో రూ.13,022 కోట్లు ఈ పథకంలో ఇచ్చాం. 

*వైయస్సార్‌ ఆసరా:*

మిమ్మల్ని అడుగుతున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాల వల్ల వారు ఇబ్బంది పడొద్దని, ఆ డబ్బులు తిరిగి ఇస్తున్న వైయస్సార్‌ ఆసరా వంటి పథకం ఉందా? ఈ పథకంలో పొదుపు సంఘాలకు చెందిన 80 లక్షల అక్కచెల్లెమ్మలకు చెల్లించిన సొమ్ము రూ.12,758 కోట్లు. మొత్తంగా 4 విడతల్లో నా అక్కచెల్లెమ్మలకు అక్షరాలా రూ.25,512 కోట్లు ఇవ్వనున్నది మీ అన్న, తమ్ముడి ప్రభుత్వం. 

అంతే కాకుండా ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని వ్యాపారం చేయాలనుకునే అక్కచెల్లెమ్మలకు బ్యాంకులతో మాట్లాడి అవకాశం చూపించడమే కాకుండా ఏటా దాదాపు రూ.20 వేల కోట్లు రుణాలు క్రోడీకరించే కార్యక్రమం కొనసాగుతోంది.

*వైయస్సార్‌ సున్నా వడ్డీ:*

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ పథకం మరెక్కడైనా ఉందా? వైయస్సార్‌ సున్నా వడ్డీ కింద ఇప్పటి వరకు కోటి మంది అక్కచెల్లెమ్మలకు అక్షరాలా రూ.2,354 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశాం.

*వైయస్సార్‌ చేయూత:*

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండి, ఏ పథకం అందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు వరసగా 4 ఏళ్లలో రూ.75 వేలు ఇస్తూ వైయస్సార్‌ చేయూత పథకం దేశంలో ఎక్కడైనా ఉందా? ఈ ఒక్క పథకం ద్వారా 24.95 లక్షల నా అక్కచెల్లెమ్మలకు రెండు విడతలుగా ఇప్పటి వరకు రూ.9,180 కోట్లు అందించాం. కేవలం డబ్బులు ఇవ్వడమే కాకుండా బ్యాంకులు, వివిధ కార్పొరేట్‌ సంస్థలతోనూ మాట్లాడి, వారికి వ్యాపార అవకాశాలు చూపాం. ఆవులు, గేదెలు కొనుక్కుని అమూల్‌ సంస్థతో వ్యాపారం చేస్తున్నారు. రిలయన్స్, ఐటీసీ వంటి సంస్థలు వారికి తోడుగా నిలుస్తున్నాయి. ఆ విధంగా వారికి బ్రతికే మార్గాలు కూడా చూపుతున్నాం. ఇది దేశంలో ఎక్కడైనా ఉందా?

*వైయస్సార్‌ పెన్షన్‌ కానుక:*

దేశంలోనే అత్యధికంగా రూ.2500 పెన్షన్‌ ఇవ్వడమే కాకుండా అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులకు ఈ స్థాయిలో ఇవ్వడం, అది కూడా ప్రతి నెలా ఒకటో తేదీన సెలవైనా, పండగైనా సరే ఇంటికి వెళ్లి ఏ ప్రభుత్వం అయినా ఇస్తోందా? వైయస్సార్‌ పెన్షన్‌ కానుకలో 61.74 లక్షల పెన్షన్లు ఇస్తుండగా, వారిలో 36.50 లక్షల మంది అక్కచెల్లెమ్మలు ఉన్నారు. వారికి రూ.28,885 కోట్ల పెన్షన్‌ ఇవ్వడం జరిగింది.

*ఇళ్లు–ఇళ్ల స్థలాలు–ఆస్తి:*

ఇల్లు లేని ప్రతి నిరుపేదకు, అది కూడా అక్కచెల్లెమ్మ పేరుతో ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా, అక్షరాలా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తూ, వాటిలో ఇళ్లు కట్టించడం దేశంలో మరెక్కడైనా ఉందా? ఈ ఒక్క పథకమే ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఇల్లు పూరై్తన తర్వాత కనీసం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆస్తి పెట్టినట్లు అవుతుంది. ఇది దేశంలో ఎక్కడా లేదు.

*విద్యాదీవెన. వసతి దీవెన:*

పెద్ద చదువుల కోసం అప్పులపాలు కాకుండా ఏ ప్రభుత్వమైనా ఇక్కడి మాదిరిగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ, విద్యాదీవెన, వసతి దీవెన వంటివి అమలు చేస్తోందా? అక్షరాలా జగనన్న విద్యాదీవెన ద్వారా 21.50 లక్షల తల్లులకు రూ.6,260 కోట్లు ఇచ్చాం. ఇందులో గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూ.1800 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక వసతి దీవెన కింద తల్లుల ఖాతాల్లో ఇప్పటి వరకు మరో రూ.2,305 కోట్లు జమ చేశాం. 

*వైయస్సార్‌ సంపూర్ణ పోషణ:*

వైయస్సార్‌ సంపూర్ణ పోషణ కింద గర్భిణిలు, బాలింతలకు మంచి ఆహారం అందజేస్తున్నాం. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడంతో పాటు, అంగన్‌వాడీలను ప్రీప్రైమరీ స్కూళ్లుగా మార్చడం, ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రారంభిస్తున్నాం. మరోవైపు ఏడు షెడ్యూల్‌ ప్రాంతాల్లో, అంటే గిరిజన ప్రాంతాల్లోని వారికి ఇంకా మంచి పౌష్టికాహారం అందజేస్తూ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకం అమలు చేస్తున్నాం. ఈ పథకంలో అక్షరాలా 30.16 లక్షల మందికి మేలు కలుగుతోంది. ఈ పథకానికి గత ప్రభుత్వ హయాంలో ఏటా కేవలం రూ.600 కోట్లు ఖర్చు చేయగా, మనందరి ప్రభుత్వం ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఇది దేశంలో ఎక్కడా లేదు.

*వైయస్సార్‌ కాపు నేస్తం:*

వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా 3.28 లక్షల అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ, రూ.75 వేలు ఇస్తున్నాం. ఇప్పటికే రెండు దఫాలుగా రూ.982 కోట్లు ఇచ్చాం. ఎవ్వరూ ఊహించని విధంగా ఈ పథకం అమలు చేస్తున్నాం. ఇలాంటి పథకాన్ని గత ప్రభుత్వం ఏనాడూ అమలు చేయలేదు.

*ఈబీసీ నేస్తం:*

వైయస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద ఓసీ మహిళలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. 45 నుంచి 60 ఏళ్ల మ«ధ్య ఉన్న దాదాపు 3.93 లక్షల నిరుపేద ఓసీ అక్కచెల్లెమ్మలకు, ఒక్కో కుటుంబానికి ఏటా రూ.15 వేల చొప్పున వరసగా మూడేళ్లపాటు అందించనున్నాం. ఇప్పటికే రూ.589 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశాం. 


*ఈ 34 నెలల్లో ఎంత మొత్తం?:*

ఇలా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 34 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు నేరుగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా అందించిన మొత్తం ఏకంగా రూ.83,509 కోట్లు. అదే విధంగా పరోక్షంగా అక్కచెల్లెమ్మలకు రూ.34,841 కోట్ల లబ్ధి జరిగింది. ఆ విధంగా మొత్తంగా ఈ 34 నెలల కాలంలో అక్కచెల్లెమ్మలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించిన సొమ్ము అక్షరాలా రూ.1.18 లక్షల కోట్లు. 


*నిశ్శబ్ధ విప్లవం:*

ఇవి కాక జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, వైయస్సార్‌ స్వేచ్ఛ, ఇంగ్లిష్‌ మీడియమ్, నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు.. ఇవన్నీ కూడా బాలికలను పెద్ద చదువులు చదివించడంలో ఒక నిశ్శబ్ద విప్లవంగా తోడ్పడుతున్నాయి.


*దిశ చట్టం–దిశ యాప్‌:*

ఇంకా మహిళల రక్షణ కోసం మనందరి ప్రభుత్వం ఎక్కడా జరగని విధంగా దిశ బిల్లు రూపొందించింది. నేరాల సంఖ్య తగ్గాలంటే శిక్ష విధించే కాలం తగ్గాలని చూశాం. అందుకే 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని, 14 రోజుల్లో విచారణ, 21 రోజుల్లో శిక్ష పడే విధంగా బిల్లు రూపొందించాం. అయితే ఈ బిల్లుకు కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఒకవైపు ఆ అనుమతి కోసం ప్రయత్నిస్తూనే, మరోవైపు అందులో అంశాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.

దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ తెచ్చాం. ఇప్పటి వరకు 1.13 కోట్ల మంది అక్కచెల్లెమ్మలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఫోన్‌లో ఆ దిశ యాప్‌ ఉంటే, అన్న తోడుగా ఉన్నట్లే. అక్కచెల్లెమ్మ ఆపదలో ఉంటే, ఆ యాప్‌లో ఎస్‌ఓఎస్‌ నొక్కినా లేదా ఆ ఫోన్‌ 5సార్లు ఊపితే చాలు, నగరాల్లో అయితే 10 నిమిషాలు, గ్రామాల్లో 20 నిమిషాలు కూడా దాటకముందే పోలీసులు చేరుకుంటున్నారు. ఇది దేశంలో ఎక్కడా లేని వ్యవస్థ పని చేస్తోంది. ఈ యాప్‌ ద్వారా ఇప్పటి వరకు ఆపదలో ఉన్న 900 మంది అక్కచెల్లెమ్మలను కాపాడడం జరిగింది.


*తగ్గిన దర్యాప్తు కాలం:*

అలా అక్కచెల్లెమ్మల కాల్స్‌ అటెండ్‌ చేయడమే కాకుండా, నేరాల దర్యాప్తు, ఛార్జ్‌షీట్‌ల దాఖలులో చాలా వేగం పెరిగింది. గత ప్రభుత్వ హయాంలో, అంటే 2017లో ఆ నేరాల దర్యాప్తుకు ఒక్కో కేసుకు సగటున 169 రోజుల సమయం పడితే, ఇప్పుడు 2021లో ఒక్కో కేసు దర్యాప్తు సగటు సమయం 61 రోజులకు తగ్గిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇది ఒక పెద్ద అచీవ్‌మెంట్‌.

కేవలం 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన కేసులు మొత్తం 1,132. దేశంలో మహిళలపై నేరాలకు సంబందించి ఇంత వేగంగా దర్యాప్తు చేయడం లేదు.

మహిళలపై సైబర్‌ నేరాలకు పాల్పడిన వారిపై 2,134 హిస్టరీ షీట్స్‌ను, 1,531 సైబర్‌ బుల్లీయింగ్‌ షీట్లు ఇప్పటి వరకు ఓపెన్‌ చేయడం జరిగింది. ఇంకా సెక్సువల్‌ అఫెండర్లకు సంబంధించిన క్రైమ్‌ డేటా ఆధారంగా దాదాపు 2 లక్షల మందిని గుర్తించి, వారిని జియో ట్యాగింగ్‌ ద్వారా వెంబడిస్తున్నాం. ఎక్కడైనా అక్కచెల్లెమ్మలకు ఏ ఇబ్బంది కలిగినా ఈ ప్రభుత్వం ఊర్కోదు.


*దిశ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు:*

దిశ ఫోరెన్సిక ల్యాబ్‌ల ఏర్పాటు దేశంలోనే అతి పెద్ద అడుగు. రూ.87 కోట్లు కేటాయించి, ప్రతి జిల్లాలో ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేకంగా సిబ్బంది నియామకం కూడా జరిగింది.


*బ్రహ్మాస్త్రాలు:*

దిశ యాప్‌ ఒక బ్రహ్మాస్త్రం అయితే, మరో అస్త్రం ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ నియామకం. ఇది ఒక విప్లవాత్మక మార్పు.


*సమానంగా చూడాలి:*

పాప అయినా, బాబు అయినా ఇద్దరినీ ప్రతి కుటుంబం సమానంగా చూడాలి. ఆడవారి మీద ఆధిపత్యం, వేధించడం, చులకన చేయడాన్ని మనందరం కలిసికట్టుగా వ్యతిరేకించాలి. అలాంటి రాక్షస గుణాలు ఏ మనిషి కూడా చేయకూడని పనులు. మారుతున్న సమాజంలో మనుషులూ ఎదగాలి. గత పాలకులు ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోండి.

‘కోడలు మగ పిల్లవాణ్ని కంటానంటే అత్త వద్దంటుందా?’ అన్నారు. అదే ఇవాళ మీ అన్నగా, తమ్ముడిగా ఒక మాట చెబుతున్నాను. నాకు ఉన్నది ఇద్దరూ ఆడపిల్లలే.


*మహిళాభ్యుదయమే లక్ష్యం:*

మహిళాభ్యుదయానికి కట్టుబడి అడుగులు ముందుకు వేస్తున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ అందరికి ఇంకా మంచి చేసే అవకాశం రావాలని కోరుకుంటూ, మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.. అంటూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రసంగం ముగించారు.

ఆ తర్వాత కేక్‌ కట్‌ చేసిన ముఖ్యమంత్రి అక్కచెల్లెమ్మలకు స్వయంగా తినిపించారు.

Comments
Popular posts
రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్‌ చేయాలి:
Image
భారత త్రో బాల్ జట్టు కెప్టెన్ శ్రీ చావలి సునీల్ కి ఆర్థిక సహాయం క్రింద 25 లక్షల చెక్కును అందించిన రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కే. రోజా
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image
దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్*
Image
వీఆర్వో లు రెవెన్యూ చట్టాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని క్షేత్ర స్థాయిలో సక్రమంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అనంతపురం,(ప్రజాఅమరావతి ): ఆగస్టు 27: నూతనంగా పదోన్నతులు పొందిన గ్రామ రెవెన్యూ అధికారులు చట్టాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రజలకు సక్రమంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. గురువారం నూతనంగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు 2వ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసి గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం స్థాపన కోసం ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో విఆర్వోలు అంతా మెరుగ్గా పనిచేసి ప్రభుత్వ లక్ష్యసాధనకు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటిని అనుభవజ్ఞులైన సీనియర్లతో నివృత్తి చేసుకోవాలన్నారు. రెవెన్యూ శాఖ నిర్దేశించిన ఉత్తర్వుల మేరకు వీఆర్వో లు నాలుగు విభాగాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇందులో రెవెన్యూ భూ రికార్డులు, సామాజిక సంక్షేమం, అభివృద్ధి, పోలీసు తదితర విభాగాల వారీగా విధులు నిర్వర్తించాలన్నారు. రెవెన్యూ కు సంబంధించి అన్ని గ్రామ అకౌంట్లు, భూ రికార్డులు పక్కాగా నిర్వహించాలన్నారు. నీటి పన్ను సెస్ తో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన వసూళ్లు చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ భూములను తనిఖీ చేయాలన్నారు. సర్వే రాళ్లను ప్రతి ఏటా రెండు సార్లు పరిశీలించాలని, రాళ్లు లేనిచోట ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు, చెట్లు, చెరువులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత విఆర్ఓ లపై ఉంటుందన్నారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ రికవరీ చట్టం కింద రికవరీ చేయాల్సి వస్తే ఆ ఆస్తుల వివరాలు అందించి అధికారులకు సహకరించాలన్నారు. అలాగే పోలీసు విధులకు సంబంధించి రెవెన్యూ అధికారులు మెజిస్ట్రేట్ అధికారాలు వినియోగించే సమయంలో వీఆర్వోలు సహాయకులుగా పనిచేయాలని, ఎలాంటి అనుమానిత సమాచారాలు తెలిసినా వాటిని పోలీసులకు అందించాల్సి ఉంటుందన్నారు. నేరాలు జరిగిన సమయంలో ఆధారాలతో వాస్తవ నివేదికలు సమర్పించాలన్నారు. సామాజిక సంక్షేమం, అభివృద్ధి, విధులకు సంబంధించి వివిధ ప్రభుత్వ పథకాలను అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు. అంటరానితనం నిర్మూలనలో బాధ్యతగా పని చేయాలని, పౌరసరఫరాల విషయంలో అధికారులకు సహకారం అందించాలన్నారు. పంట నష్టం జరిగినప్పుడు ఆ నష్టం అంచనా కు సంబంధించి వ్యవసాయ అధికారులకు సహకారం అందించాలన్నారు. తహశీల్దార్, సబ్ కలెక్టర్, ఆర్డిఓ, జిల్లా కలెక్టర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఆదేశాల మేరకు విధులను వీఆర్వోలు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. అలాగే గ్రామాలలో అవసరమైన సమాచారాన్ని ప్రజలందరికీ చేరువుగా తీసుకువెళ్ళే క్రమంలో దండోరా వేయించడం, లీగల్ నోటీసులు జారీ ప్రక్రియ లాంటి విధులు కూడా వీఆర్వోల పరిధిలో ఉంటాయన్నారు. అందువల్ల ఆయా గ్రామ సచివాలయంలో పనిచేసే విఆర్వోలు ముందస్తుగా చట్టాలపై అవగాహన చేసుకొని జాగ్రత్తగా తమ విధులను నిర్వర్తించాలన్నారు. వీఆర్వోల విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, డిఆర్ఓ గాయత్రీ దేవి, హ్యాండ్ సెట్ సీఈవో హరి ప్రసాద్, కలెక్టరేట్ ఏవో విజయలక్ష్మి, తహసిల్దార్ లు విశ్వనాథ్, నాగరాజు, హరి కుమార్, డి టి శ్రీధర్, పెనుగొండ, కదిరి, కళ్యాణదుర్గం డివిజన్ నుండి 111 మంది పదోన్నతులు పొందిన విఆర్వోలు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు..