సబల " కార్యాచరణకు శ్రీకారం

 .


*" సబల " కార్యాచరణకు శ్రీకారం


*


*మహిళ కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి*


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  చేతులమీదుగా ఆవిష్కరించిన  " సబల "   (ఆమెకు అండగా ఆంధ్ర ప్రదేశ్)  సోమవారం తిరుపతిలో శ్రీకారం చుట్టింది.


ఇందులో భాగంగా  " సబల "  బుక్ లెట్ ను...,  మార్చి  టు మార్చి కార్యాచరణ రూపొందించాలన్న ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదేశాల మేరకు మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి సోమవారం తిరుపతి ఎస్ వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజా రెడ్డి, ..,, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వి సి డాక్టర్ జమున లను  వేరువేరుగా..వారి  చాంబర్ లలో కలిసి  " సబల "  బుక్లెట్ ను అందించింది.


విద్యార్థులతో చిత్రలేఖన, వ్యాసరచన పోటీ పరీక్షలను నిర్వహింప చేయవలసిందిగా.. వారిని కోరిన మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి.


"క్యాంపస్ క్యాప్స్ " పేరిట ఒక కమిటీని నియమించి ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ "దిశ యాప్" గురించి విరివిగా వారితో విశదీకరించారు.


ఐపీఎస్ సెక్షన్ కి సంబంధించిన గోడ పత్రాలను ఏర్పాటు చేయవలసిందిగా ఎస్వీయూ వీ సి, పద్మావతి మహిళ విశ్వవిద్యాలయ వీ సీ లను గజ్జల లక్ష్మి కోరారు.


 ఎస్ వి యు.  వీ.సి తో పాటు  రిజిస్టర్ మహమ్మద్ హుస్సేన్, ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డి లను వీ సీ  చాంబర్లో కలసి చర్చించడం జరిగింది.

Comments