ఏపీలో ప్రతి మహిళా క్షేమం, ప్రతి మహిళా సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళాలి – సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

 అమరావతి (ప్రజా అమరావతి)!


దిశ యాప్, చట్టం అమలుపై అసెంబ్లీలోని ఛాంబర్‌లో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ సమీక్ష.


ఏపీలో ప్రతి మహిళా క్షేమం, ప్రతి మహిళా సంక్షేమం అనే నినాదంతో ముందుకెళ్ళాలి – సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


నేర నిరోధం కోసం సమస్యాత్మక ప్రాంతాలలో అతి త్వరలో 163 దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ ప్రారంభించనున్న సీఎం, వీటితో పాటు అందుబాటులోకి రానున్న 18 దిశ మొబైల్‌ రెస్ట్‌రూమ్స్‌.


ప్రతీ గడపకూ దిశ చేరాలి, ప్రతీ మహిళా దిశ యాప్‌ వినియోగించాలి – సీఎం.


ఇప్పటివరకూ దిశ యాప్‌ డౌన్‌లోడ్స్‌ – 1.16 కోట్లు.


దిశ యాప్‌ నొక్కగానే వెంటనే స్పందించాలి, అతి తక్కువ సమయంలో చేరుకుని ఆపన్నహస్తం అందించాలి – సీఎం*


దిశ పీఎస్‌కు వచ్చే ప్రతీ కేస్‌ కూడా శిక్ష పడేవరకూ రెగ్యులర్‌గా మానిటర్‌ చేయాలి, ఎప్పటికప్పుడు బాధితులతో మాట్లాడి వారికి స్వాంతన కలిగించాలి. కన్విక్షన్‌ పెరిగే దిశగా త్వరితగతిన ఎవిడెన్స్‌ సేకరించాలి – సీఎం.


ఇప్పటివరకూ 92.7 శాతం కేసులు (పోక్సో, రేప్‌ కేసుల్లో ) చార్జిషీట్లు వేసినట్లు సీఎంకి వివరించిన అధికారులు.


దిశ పై సోషల్‌ మీడియా ద్వారా కెపాసిటీ బిల్డింగ్‌ చేయడంతో పాటు, పనితీరు మెరుగుపరిచేలా రోజువారీ సమీక్షలు చేయాలి – సీఎం.


గ్రామ వలంటీర్, మహిళా పోలీస్‌ను భాగస్వామ్యం చేయాలి, ప్రతీ 15 రోజులకోసారి దిశపై హైపవర్‌ కమిటీ రివ్యూ చేయాలి – సీఎం.


దిశ యాప్‌ ద్వారా వచ్చే కాల్స్, కేసుల్లో ఎట్టి పరిస్ధితుల్లో అలసత్వం ప్రదర్శించకూడదు. ఒకవేళ అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం. 


ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న డీజీపీ కే.రాజేంద్రనాథ్‌ రెడ్డి, డీఐజీ టెక్నికల్‌ సర్వీసెస్‌ పాలరాజు, పోలీస్‌ ఉన్నతాధికారులు.

Comments