పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమం లో మంత్రి తానేటి వనిత



కొవ్వూరు (ప్రజా అమరావతి);  


పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కార్యక్రమం లో మంత్రి తానేటి వనిత



రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం తో పాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


శనివారం సాయంత్రం కొవ్వూరు మండలం కాపవరం సొసైటీ భవనం ప్రారంభోత్సవం, వాడపల్లి చాగల్లు మండలం చంద్రవరం లలో  ఆర్ అండ్ బి రోడ్డు  శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, కరోనా సమయంలో కూడా పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ అండగా నిలిచామన్నారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడడంతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కోసం నిధులు వెచ్చిస్తూ అభివృద్ధి పనులు ముమ్మరంగా చేపట్టడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కొందరికి కంటగింపు గా ఉందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర సర్వోతో ముఖాభివృద్ది కోసం జగనన్న అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలు రాజకీయా పదవుల్లో, నామినేటెడ్ పోస్టు ల్లో 50 శాతం మించి పదవులు కట్టబెట్టి మహిళా సాధికారికత కోసం కృషి చేస్తన్నట్లు తెలిపారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు శాశ్వత భవనాల నిర్మాణాలను చేపట్టి, అతి తక్కువ కాలంలో ప్రారంభించడమే నిదర్శనం అన్నారు. 




 పర్యటన లో భాగంగా  కొవ్వూరు మండలం కాపవరం సొసైటీ భవనం ప్రారంభోత్సవం,  కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామం లో  ఆర్ అండ్ బి రోడ్డు  ,  చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో  ఆర్ అండ్ బి రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రూ.360 లక్షలతో చేపడుతున్న అఖండ గోదావరి రైట్ బండ్ రహదారి పనుల కు శంఖుస్థాపన చేశారు.


ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, జెడ్పీ టిసి బొంతా వెంకట లక్ష్మీ, ఎంపిపి కాకర్ల నారాయుడు, , ఎంపిటిసి లు, అధికారులు పాల్గొన్నారు.



Comments