రమేష్ హాస్పిటల్స్ లో ప్రపంచ ఊబకాయం దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం.
గుంటూరు ( ప్రజా అమరావతి); వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్'- ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో 2015 నుంచి ప్రజలలో ఊబకాయం పై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 4 వ తేదీనీ ప్రపంచ ఊబకాయ దినోత్సవంగా జరుపుకోవాలని మరియు ప్రతి ఒక్కరూ ఊబకాయం పై స్పందించాలి అనే నినాదాన్ని ఈ సంవత్సరానికి ఇచ్చింది. వరల్డ్ ఒబేసిటీ డే సందర్భంగా ఊబకాయం యొక్క మూల కారణాలను అన్వేషించటం వాటిని తగ్గించే మార్గాలు పై దృష్టి పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధిక కొవ్వు పేరుకుపోవటం వలన వచ్చే అధిక బరువు మరియు ఊబకాయం ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉంటే అధిక బరువుగా పరిగణించడం మరియు 30 కంటే ఎక్కువగా ఉంటే ఊబకాయం గా పరిగణిస్తారు. బెల్జియం మరియు అమెరికా దేశాలలో తర్ఫీదు పొందిన రమేష్ హాస్పిటల్స్ లాప్రోస్కోపిక్ & బారియాటిర్క్ సర్జన్ డాక్టర్ బడి పాటి రాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం వలన సంవత్సరానికి సుమారుగా 28 లక్షల మంది మరణిస్తున్నారని 2025 సంవత్సరానికి అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 270 కోట్ల మంది అధిక బరువు కలిగి ఉంటారని వారి లో వంద కోట్ల మంది ఊబకాయం బారిన పడతారని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ తెలిపింది. ప్రస్తుతం పిల్లలలో 18 % ఉన్న ఊబకాయం 2025 నాటికి 60 %కి పెరుగుతున్నట్లుగా అంచనా వేస్తూ వీటి వలన జరిగే దుష్ఫలితాలను, మరణాలను తగ్గించేందుకు కృషి చేస్తూ రమేష్ హాస్పిటల్స్ ప్రజలలో అవగాహన కలిగిస్తుందని, బాడీ మాస్ ఇండెక్స్ 32.5 లోపు ఉన్న వారికి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, డాక్టర్ పర్యవేక్షణలో ఊబకాయం వలన వచ్చే దుష్ఫలితాలను నివారించవచ్చని 32.5 కన్నా ఎక్కువ ఉన్న వారికి శస్త్ర చికిత్స ద్వారా స్థూలకాయం వలన వచ్చే రక్తపోటు, మధుమేహం, నిద్రలేమి తనం, సంతాన రాహిత్యం, గుండెపోటు, పక్షవాతం వంటి వ్యాధులను అదుపులో ఉంచవచ్చని డాక్టర్ రాజు తెలియజేశారు. రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత మాట్లాడుతూ ఊబకాయం మరియు దాని వలన వచ్చే వ్యాధులను నివారణ మరియు అదుపులో ఉంచటానికి రమేష్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరిత, ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ భరణి, పల్మనాలజిస్ట్ డాక్టర్ బాల భాస్కర్, ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ స్వప్న, ఫిజీషియన్ డాక్టర్ సత్యానంద్ మరియు డైటీషియన్ లతో కూడిన ప్రత్యేక విభాగాన్ని రమేష్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఊబకాయం పై ప్రజలలో అవగాహన పెంచడం కోసం రమేష్ హాస్పిటల్స్ లో గత వారం రోజులుగా అత్యధిక బాడీమాస్ ఇండెక్స్ కలిగిన వారికి పోటీ నిర్వహించినట్లు, ఈ కార్యక్రమంలో 70 మంది పాల్గొన్నారని అత్యధిక బాడీమాస్ ఇండెక్స్ 48.2 3 ఉండి 148 కేజీల బరువున్న, 38 సంవత్సరాల శ్రీనివాస్ అనే యువకునికి ఒక లక్ష రూపాయల కాష్ అవార్డ్ అందించామని రమేష్ హాస్పిటల్స్ గ్రూప్ బిజినెస్ డెవలప్మెంట్ డాక్టర్ వై కార్తీక్ చౌదరి తెలియజేశారు.
addComments
Post a Comment