కేంద్రమంత్రి ముందు నిర్దిష్ట అంశాలను ఉంచిన ముఖ్మమంత్రి, రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులు:



పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్‌ షెకావత్‌.


పోలవరం (ప్రజా అమరావతి);

పునరావాస కాలనీలను పరిశీలించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌.

–ముందుగా వ్యూ పాయింట్‌ వద్ద పరిశీలన

తర్వాత స్పిల్‌వే వద్ద ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ పరిశీలన.

*– పూర్తైన ఎగువ కాఫర్‌ డ్యాంను పరిశీలించిను సీఎం, కేంద్రమంత్రి*.

*–ఆయా ప్రాంతాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను వివరించిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారులు, రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ అధికారులు, ఇంజనీర్లు.*

*–తర్వాత పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులతో పోలవరం ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం, కేంద్రమంత్రి*.

*–పోలవరం ప్రాజెక్టు పురోగతి, భవిష్యత్తులో చేయాల్సిన పనులు తదితర అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించిన పీపీఏ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు.*


కేంద్రమంత్రి ముందు నిర్దిష్ట అంశాలను ఉంచిన ముఖ్మమంత్రి, రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారులు:




– 2017–18 ధరల సూచీని అనుసరించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం అంచనా రూ.55,548.87 కోట్ల రూపాయలకు ఖరారు చేయాలని రాష్ట్ర అధికారులు కేంద్ర మంత్రిని కోరారు.


– తాగునీటి కాంపొనెంట్‌ను ప్రాజెక్టులో భాగంగా పరిగణించాలని విజ్ఞప్తిచేశారు. 


–ఇదే సందర్భంలో కొన్ని కీలక అంశాలను ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ముందు ఉంచారు.

– ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం కాంపొనెంట్‌ వారీగా రీయింబర్స్‌ చేస్తోందని, కాంపొనెంట్‌ వారీగా నియంత్రణల వల్ల కొన్ని పనులు ముందుకు సాగని పరిస్థితి ఉందని కేంద్రమంత్రి మందు ఉంచిన ముఖ్యమంత్రి. 

– దీనివల్ల పోలవరం, కుడి–ఎడమ కాల్వలకు సంబంధించిన పనులు  ముందుకు సాగని పరిస్థితి ఉందని, ఏకంగా చేసిన పనులకు బిల్లులు కూడా పీపీఏ అప్‌లోడ్‌ చేయడంలేదన్న విషయాన్ని కేంద్రమంత్రికి తెలిపిన సీఎం. 

– దీనివల్ల రాష్ట ప్రభుత్వం చేసిన ఖర్చుకు, కేంద్ర ప్రభుత్వం చేసిన రీయింబర్స్‌మెంట్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందన్న సీఎం. 

– వివిధ పనులకోసం ఖర్చుచేసిన రూ.859.59 కోట్ల రూపాయల బిల్లులను పీపీఏ నిరాకరించిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించిన సీఎం, రాష్ట్ర అధికారులు.

– మొత్తం ప్రాజెక్ట్‌ నిర్మాణాన్ని ఒకే కాంపొనెంట్‌గా తీసుకుని, ప్రతి 15 రోజులకొకసారి బిల్లులను చెల్లించాలని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి క్యాష్‌ ఫ్లో ఉంటుందని తెలిపిన సీఎం.


– దిగువ కాఫర్‌ డ్యాం మరియు ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మాణ ప్రాంతంలో వరదల కారణంగా ఏర్పడ్డ కోతకు గురైన ప్రాంతాన్ని ఏ విధంగా పూడ్చాలన్న దానిపై ఇప్పటివరకూ విధానాలను, డిజైన్లను ఖరారుచేయలేదని కేంద్రమంత్రికి తెలిపిన రాష్ట్ర అధికారులు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యాన్ని నివారించడానికి డిజైన్లను త్వరగా ఖరారుచేయాలని కోరిన సీఎం.


– పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలన్న సీఎం. దీనివల్ల పనుల నిర్మాణ పరిశీలన ఎప్పటికప్పుడు జరుగుతుందని, అలాగే సమన్వయ లోపంలేకుండా, పరిపాలన సులభంగా జరిగేందుకు వీలు ఉంటుందని తెలిపిన సీఎం. 


– పోలవరం ప్రాజెక్టు కారణంగా మంపునకు గురవుతున్న వారికి నష్టపరిహారాన్ని డీబీటీ పద్ధతిలో చెల్లించాలని కేంద్రమంత్రిని కోరిన సీఎం. 


– ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో సమస్యలను ఎప్పటికప్పుడు తొలగించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి నేరుగా కేంద్రమంత్రే సమీక్షలు చేసి వాటి పరిష్కారాలను సాధించాలని, తద్వారా పోలవరం ప్రాజెక్టును శీఘ్రగతిని పూర్తిచేయడానికి దోహదపడుతుందని కేంద్రమంత్రికి తెలిపిన ముఖ్యమంత్రి. 

– కనీసం 3 నెలల పాటు ఇలా చేయడంవల్ల సమస్యలు తొలగిపోతాయన్న సీఎం.


*సీఎం విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి:*

– ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ చేసిన విజ్ఞాపనలపై కేంద్రమంత్రి శ్రీ గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే పీపీఏ సహా, తన శాఖకు చెందిన అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 


– పోలవరం ముంపు బాధితులను పునరావాస కాలనీలకు తరలించడంపై నిర్ధిష్ట కార్యాచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు. నెలవారీ కార్యాచరణ తయారు చేయాలన్నారు. 

పీపీఏ స్థాయిలో, మంత్రిత్వ శాఖ స్థాయిలో వారం వారీగా ప్రగతి నివేదికలు ఇవ్వాలన్నారు. 


– ప్రాజెక్టు ముంపు బాధితులు ప్రత్యక్ష నగదుబదిలీ పథకంద్వారా పరిహారాన్ని ఇవ్వాలంటూ సీఎంచేసిన ప్రతిపాదనను అంగీకరించారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

– ముఖ్యమంత్రి కోరినట్టుగా పీపీఏ కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని, వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


– దిగువ కాఫర్‌డ్యాం, ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యాం వద్ద కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చడంపై, నిర్మాణాలు పటిష్టంగా చేయడంపై వెంటనే డిజైన్లు ఖరారుచేయాలని, ఈ విషయంలో జాప్యం ఉండకూడదని స్పష్టంచేశారు, దేశంలో, లేదా దేశం వెలుపల నిపుణులైన సంస్థల సేవలను వినియోగించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. 15 రోజుల్లోగా దీన్ని కొలిక్కి తీసుకు రావాలని పీపీఏ సహా అధికారులను ఆదేశించారు.


– ముఖ్యమంత్రి కోరినట్టుగా పోలవరం ప్రాజెక్టుపై ప్రతి 15 రోజులకోసారి వచ్చే మూడు నెలలపాటు సమీక్ష చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీతోపాటు, సంబంధిత అధికారులు దీనికి హాజరుకావాలన్నారు. 


– పోలవరం పనుల ప్రగతిపై ఒక డ్యాష్‌ బోర్డ్‌ని ఏర్పాటు చేయాలని, దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రగతి తెలుస్తుందన్నారు. 


– ముఖ్యమంత్రి, రాష్ట్ర అధికారులు నివేదించిన మిగిలిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటిపై ముందుకుసాగుతామన్నారు.


ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌,  రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి పి.అనిల్ కుమార్‌, రవాణా, ఐ అండ్ పీఆర్‌  మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, పీపీఏ సీఈఓ జె చంద్రశేఖర్‌ అయ్యర్‌, ఇతర ఉన్నతాధికారులు, పలువురు ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Comments