శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ప్రదోషకాలంలో పంచహారతులు సేవ అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారి పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులచే పూజలు నిర్వహించుచూ శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ శ్రీ గంగా పార్వతి(దుర్గ) సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తుల తో శాస్త్రోక్తముగా మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ద్వాదశ(12) ప్రదక్షిణలు(1. పంచమహా వాద్యము, 2.వేదపటనము, 3.రుద్రసూక్తము, 4.స్తోత్ర పఠనం, 5.భేరి, 6.కాహాలకము(కొమ్ము బూర), 7.కాంస్య నాదం,8.వీణా నాదం, 9.మురళీ నాదం, 10.గానము, 11.నృత్యం మరియు 12.మౌనం) ప్రదక్షిణములు నిర్వహించడమైనది. అనంతరం పవళింపు సేవ నిర్వహించడమైనది.
ఈ కార్యక్రమముల నందు ఆలయ కార్యనిర్వహణాధికారి వారు, ఆలయ అధికారులు, సిబ్బంది మరియు భక్తులు పాల్గొని భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించారు.
addComments
Post a Comment