ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు జరిగిన మేలు ఏంటనేది సభలో చర్చిస్తాం.

 విజయవాడ (ప్రజా అమరావతి);

మార్చి ఎనిమిదో తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.


ఏర్పాట్ల ను పరిశీలించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ.


*మంత్రి తానేటి వనిత కామెంట్స్*


ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు జరిగిన మేలు ఏంటనేది సభలో చర్చిస్తాం.



ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు.


డ్వాక్రా మహిళలు జగనన్న చేయూత పధకం తో పారిశ్రామిక వేత్తలుగా ఎదుగుతున్నారు.


రాజకీయ సాధికారత సాధించే విధంగా యాభై శాతం రిజర్వేషన్ ను ముఖ్యమంత్రి కల్పించారు.


*మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ...*


మార్చి 8 న నిజమైన సాధికారత పండుగను మహిళలు జరుపుకుంటున్నారు.


ఏపీకి మహిళల పాలన అలవాటైపోయింది.


ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకం మహిళలను ఉద్దేశించి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు.


అనేక పథకాలు ద్వారా మహిళా సాధికారత సాధించే దిశ గా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.


మహిళల సంతోషాన్ని వ్యక్తం చేసేందుకు సభ జరుగుతుంది.


ప్రతి విషయంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందనేందుకు ఈ సభ అద్దం పడుతోంది.

Comments