యెస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది


డి‌జి‌పి కార్యాలయం (ప్రజా అమరావతి);


మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన మహిళా అధికారిణిలకు బహుమతులు అందజేసిన ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS*


మహిళా దినోత్సవం సందర్భంగా మంగళగిరి లోని డి‌జి‌పి కార్యాలయం లో మహిళల కోసం ప్రత్యేకంగా వైద్య శిభిరాన్ని ప్రారంభించడం తో  పాటు రాష్ట్రం లోని 18 యూనిట్ లలో విధులు నిర్వహిస్తూ ఉత్తమ ప్రతిభ కనబర్చిన కానిస్టేబుల్ స్థాయి నుండి డిఎస్పీ స్థాయి అధికారిణిలకు అవార్డులను అందజేసిన డి‌జి‌పి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి IPS.


 ఈ సంధర్భంగా డి‌జి‌పి గారు మాట్లాడుతూ వై.యెస్.జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల రక్షణ కోసం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది
అని అందుకు అనుగుణంగా అనేక కార్యక్రమాలను చెప్పటడం తో  పాటు క్షేత్రస్థాయిలో అమలు చేస్తుందని అన్నారు. మహిళలపై జరిగే నేరాల ఫిర్యాదుల కోసం దిశ పోలీస్ స్టేషన్ల, వేదింపుల నుండి రక్షణ కల్పించడానికి దిశ అప్లికేషన్ ను అందుబాటు లోకి తీసుకురావడం జరిగింది.


దిశ మొబైల్ అప్లికేషన్ ద్వారా రాష్ట్రం లోని మహిళలకు అన్ని సందర్బాలలో అందుబాటులో ఉండే విధంగా అత్యంత ఆధునిక టెక్నాలజీతో ప్రవేశ పెట్టిన  దిశా మొబైల్ అప్లికేషన్ (SOS)  స్వల్ప వ్యవధి లోనే  1,13,84,512 మంది డౌన్ లోడ్ చేసుకోవడం ఒక గొప్ప విశేషం అన్నారు. మహిళల ఫిర్యాదులపైన పోలీసుల ప్రతిస్పందన సరాసరి ఐదు నిమిషాలలోపే నమోదైంది. ఇది దేశంలోనే అత్యుత్తమ ప్రతిస్పందనగా నమోదైంది. దేశంలో మహిళా రక్షణకై తయారుచేసిన మొబైల్ అప్లికేషన్ల లో ప్రధమ స్థానంలో కొనసాగుతుంది. అన్ని వేళల్లో పోలీసులు తమకు రక్షణగా, తోడు నీడగా ఉన్నారనే భావన కలుగచేస్తూ, వారిలో ఆత్మస్థైర్యాన్ని  కల్పించే విధంగా ఈ దిశా యాప్ సేవలను అందిస్తుంది.


*GIS Based GPS Tracking System* ద్వారా పోలీస్ వాహనాల లైవ్ ట్రాకింగ్ విధానం ద్వారా అతి తక్కువ సమయంలో బాధితుల వద్దకు చేరుకొని సత్వరమైన, ఉత్తమమైన సేవలు అందించేందుకు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నాము. ఈ విధానం ద్వారా క్షేత్రస్థాయిలో ఫిర్యాదు చేసిన వారి ప్రాంతాన్ని  గుర్తించి వారికి సమీపంలోని గస్తీ వాహనం వారి వద్దకు అత్యంత స్వల్ప సమయంలో చేరుకోవడం దీని ప్రత్యేకత. ఈ సాంకేతిక వినియోగం వల్ల పోలీసుల ప్రతిస్పందన అత్యంత వేగవంతమైంది. 2021 లో సగటున 92.21% కేసులలో చార్జ్ షీట్ దాఖలు చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 


దిశ ద్వారా వచ్చే ఫిర్యాదుల పట్ల కేసు నమోదు మొదలుకొని నింధితులకు శిక్ష పడే వరకు భాదితులకు బారోసా కల్పించాలని, అలా చేసినప్పుడు మాత్రమే మహిళలకు పూర్తి స్థాయి లో పోలీసు పైన నమ్మకం కలుగుతుంది. ఒక చోట నేరం జరిగితే దాని ప్రభావం అన్నీ ప్రాంతాలపైన ఉంటుంది. అందుకే ఒక మహిళా అధికారిగా తమ పరిధిలో మహిళల పట్ల జరుగుతున్నా నేరాలను పూర్తి స్థాయి లో అరికట్టినపుడే మనం మన లక్ష్యాలను చేరుకుంటామని తెలిపారు. అనంతరం కేసు దర్యాప్తు లో ప్రతిభ కనబరిచిన మహిళా అధికారిణిలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ IPS, సిఐడి అడిషనల్ డీజి సునీల్ కుమార్ IPS, ఐజి నాగేంద్ర కుమార్ IPS, టెక్నికల్ సర్వీసెస్ డిఐజి పాలరాజు IPS తో ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments