తాడువాయి పునరావాస కాలనీ, పశ్చిమగోదావరి జిల్లా (ప్రజా అమరావతి);
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం, తాడువాయి పునరావాస కాలనీలో పర్యటించి, కాలనీ పనులను పరిశీలించిన సీఎం శ్రీ వైయస్.జగన్, కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.
*తాడువాయిలో సీఎం శ్రీ వైయస్.జగన్ మాట్లాడుతూ ఏమన్నారంటే... :*
ఈ రోజు తాడవాయిలో దాదాపు 3905 ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. ఇళ్ల నిర్మాణ పనులన్నీ చక,చకా పూర్తవుతున్న వాతారవరణం చూస్తున్నాం. ఇదంతా చూడ్డానికి చాలా చక్కగా అనిపిస్తోంది. పోలవరం కోసం సహకరించిన ప్రతి నిర్వాసితుడికి కూడా ఒక మంచి ఇళ్లు ఇవ్వడం,
వాళ్లను అన్ని రకాలుగా బాగా చూసుకోవడం... జరుగుతుంది. అన్ని రకాలుగా ఇది గొప్ప ప్రాజెక్టు అవుతుంది. మీరు చెప్పిన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తాను. మరీ ముఖ్యంగా ఇక్కడ లైవ్‌లీహుడ్ ట్రైనింగ్, మరియూ ఎంప్లాయిమెంట్‌కి సంబంధించి ఏదైనా అవకాశాలు చూడాలి అని చెప్పి వినతులు వస్తున్నాయి. ఇక్కడికి రాకమునుపే షెకావత్ గారితో ప్రస్తావించడం జరిగింది. ఆయన కూడా దీనిపై సానుకూలంగా ఆలోచన చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరం కలిసికట్టుగా ఏదైనా ఒక కార్యాచరణ చేసి జీవనోపాధికి ఇక్కడ ఏదైనా మార్గాన్ని చూపిస్తామని కచ్చితంగా చెపుతున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.
నేను ఉదయం ఆర్ ఆండ్ ఆర్ కాలనీలో తిరిగినప్పుడు చెప్పినట్టుగా... కొన్ని కొన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా సహాయం చేస్తామని చెప్పాం. ఈ 6.8 లక్షల రూపాయలను రూ.10 లక్షలు చేస్తామని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. అదే మాదిరిగా గతంలో నాన్నగారి హయాంలో ల్యాండ్ అక్విజేషన్ కోసం అప్పట్లో లక్షన్నర రూపాయలకే ల్యాండ్ ఇచ్చిన రైతులందరికీ కూడా రూ.5 లక్షలు వరకు తీసుకుని పోయి ఆ డిఫరెన్స్ అమౌంట్ రూ.3.50 లక్షలు కూడా వాళ్లకిస్తామన్నమాట నాకు గుర్తింది.. అవన్నీ కూడా రాబోయే రోజుల్లో కచ్చితంగా చేస్తామని మనస్ఫూర్తిగా భరోసా ఇస్తున్నాం. మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ.. ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కతజ్ఞతలు అని సీఎం శ్రీ వైయస్.జగన్ తాడువాయిలో తన ప్రసంగం ముగించారు.
*పోలవరం ప్రాజెక్టు కింద పశ్చిమ గోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీ సందర్శించి నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్:*
*ఈ సందర్భంగా కేంద్ర మంత్రి షెకావత్ ప్రసంగం:*
– గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా సభకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హదయపూర్వక నమస్కారం.
పోలవరం ప్రాజెక్టును తొలుత 1970 దశకంలోనే ప్రతిపాదించినా, పనులు మాత్రం దివంగత సీఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ముందుకు సాగాయి. అయితే దురదష్టవశాత్తూ దాదాపు 50 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఆ పనులు చేస్తుందని ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రభుత్వం, ఆ తర్వాత ప్రధాని మోదీ గారు హామీ ఇచ్చారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా భరిస్తుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. మేము మా మాటకు కట్టుబడి ఉన్నాం. ప్రాజెక్టును పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తాం. ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం అన్ని విధాలుగా కలిసి పనిచేస్తోంది.
ఇటీవలే సీఎం శ్రీ వైయస్ జగన్‌గారు ప్రధాని నరేంద్రమోదీగారిని కలిశారు. ఇరువురి మధ్య పోలవరం ప్రాజెక్టు గురించి సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రాజెక్టును నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తాం. ప్రాజెక్టు తొలి దశను ఏడాదిలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు, కేంద్రం కూడా చిత్తశుద్ధితో పని చేస్తోంది. అలాగే నిర్వాసితులకు పూర్తిగా న్యాయం చేస్తాం. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటాం. వారికి పునరావాస కాలనీల్లో అని సదుపాయాలు కల్పిస్తాం. వారు ఆ కాలనీల్లో సంతోషంగా ఉండేలా చూసే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. వారు ఆ కాలనీల్లో మంచి జీవితం గడిపేలా, వీలైనంత త్వరగా కొత్త ప్రదేశంలో స్థిరపడేలా చూస్తాం. ధన్యవాదాలు.
addComments
Post a Comment