అన్ని రంగాల్లో మహిళ లదే రాజ్యం

 అన్ని రంగాల్లో మహిళ లదే రాజ్యం


    విజయవాడ (ప్రజా అమరావతి);                    

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 

 మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ , విజయవాడ ప్రధాన కార్యాలయం లొ షేక్ ఆసీఫ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ గారి  అద్వర్యం లో పలువురు మహిళా ఉధ్యోగస్తులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ ఆసిఫ్ గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని,  ముఖ్యంగా  మన ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వం లో మహిళలకు అన్ని రంగాల్లో 51% పైన రిజర్వేషన్ లు కల్పించి సముచిత స్థానం కల్పించారని మరియు జగన్ గారి నాయకత్వం లో ఆర్థికంగా బలపడి వారి కుటుంబాలకు పెద్ద దిక్కుగా వుంటున్నారని తెలిపారు. మహిళా సిబ్బంది మాట్లాడుతూ తమకు ఈ రోజు ప్రత్యేక దినమని,  ఇంతవరకు ఏ గవర్నమెంట్ లోనూ, ఏ చైర్మన్ మమ్మల్ని పట్టించు కోలేదని ప్రస్తుత చైర్మన్  ఆసీఫ్ గారు మమ్మల్ని సత్కరించటం ఎంతో సంతోషంగా వుందని చెప్పినారు. కార్యక్రమంలో పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments