సేవా కార్యక్రమాలలో కాకాణి

 *" సేవా కార్యక్రమాలలో కాకాణి"*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి)


, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .


వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకాణి.


వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య భారీ కేక్ ను కట్ చేసిన ఎమ్మెల్యే కాకాణి.


వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.


వృద్ధులకు చేతికర్రలు అందించిన ఎమ్మెల్యే కాకాణి.


ఇటీవల మరణించిన పొదలకూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి కుమార్తెలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి గారి చేతులు మీదుగా అందించిన స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు.
 వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీని 11 సంవత్సరాలు విజయపథంలో నడిపించి, 12వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు.


 వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ 11 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, ప్రజల ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది.


 వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిలబడి పోరాడారు.


 వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలకు అండగా నిలుస్తూ, అనేక రకాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతూ, జనరంజక పాలనను అందిస్తున్నారు.


 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజల కోసం చేపట్టిన *"ప్రజా సంకల్పం"* పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుంది.


 ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2,56,256 కోట్ల రూపాయలతో, అన్ని వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్ నిధులు కేటాయించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానిది.


 నెల్లూరు జిల్లా ప్రజలు పార్టీ ఆవిర్భావం నుండి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారు.


 సర్వేపల్లి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో లాగా, రైతుల మధ్య గొడవలు సృష్టించకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాం.


 సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలన్న నా విన్నపాన్ని, మన్నించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు.


 పొదలకూరు మండలంలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనే మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు విజయమ్మ, మన మధ్య లేకపోవడం తీరని లోటుగా భావిస్తూ, నివాళులర్పిస్తున్నాం.


 విజయమ్మ కుటుంబానికి అండగా నిలిచిన స్థానిక నాయకులకు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు.


 వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేలా అందరి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నా.

Comments