నిత్యాన్నదాన కార్యక్రమంలో హుకుంపేట జమిందార్ కుటుంబంపోలవరం (పట్టిసం) (ప్రజా అమరావతి);


నిత్యాన్నదాన కార్యక్రమంలో హుకుంపేట జమిందార్ కుటుంబం86 సంవత్సరాలుగా నిరాఘాటంగా కొనసాగింపుశ్రీశ్రీశ్రీ చంద్రశేఖరచంద్ర సరస్వతి.. వారి ఆదేశాలతో 1936 వ సంవత్సరంలో  నిత్యాన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని హుకుంపేట జమిందార్ హోతా సీతారామ శాస్త్రి తెలిపారు.శ్రీవీరేశ్వరస్వామి దేవస్థానం ప్రాస్టిత్యం యొక్క గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు కంకణ బద్ధులు కావాలని హోతా వీరభద్రయ్య కి దిశానిర్దేశం చేశారు. తదుపరి కాలంలో నిత్యున్నదనాన్ని  ఆయన కుమారుడు హుకుంపేట జమిందార్ హోతా  శివరామశాస్త్రి కొనసాగించడం జరిగింది. ప్రస్తుతం హుకుంపేట జమిందార్ హోతా  సీతారామశాస్త్రి , వారి కుమారులు, శివరామశాస్త్రి పెద్ద కుమారుడు  శ్రీరామచంద్రమూర్తి నిరంతరం గా కొనసాగిస్తున్నారు. ఆలయ దర్శనానికి వొచ్చే వేలాదిమంది భక్తులకు ఉదయం నుంచి అల్పాహారం, భోజన సదుపాయాలు కల్పించి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.


ఈసందర్భంగా హోతా  సీతారామశాస్త్రి మాట్లాడుతూ, 1961 నుంచి ఈ కార్యక్రమంలో తాను పాలు పంచుకుంటూ తమ పూర్వీకులు  చూపినదారిలో కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తమ వంశస్థులు ఈ బృహత్తర కార్యక్రమం ప్రారంభించి 100 సంవత్సరాలు వేడుకలు చేయాలనీ సంకల్పం తో ఉన్నట్లు తెలిపారు. నిర్విరామంగా శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసేందుకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
Comments