పరిపాలన చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాతం పేరుతో రాజకీయాలు చేస్తారు



ఐటీడీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం వివరాలు 

  

పరిపాలన చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాతం పేరుతో  రాజకీయాలు చేస్తారు



నా కులం, మతం, కుటుంబం అంతా తెలుగు జాతే


తెలుగు జాతి ప్రపంచంలో నెం.1 కావాలన్నదే నా తపన


జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ద్వారా తప్పుడు ప్రచారం చేసి  గత ఎన్నికల్లో గెలిచారు 


 వైసీపీ వైఫల్యాలు, తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టి జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి 

- శ్రీ నారా చంద్రబాబు నాయుడు

మంగళగిరి (ప్రజా అమరావతి);

పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్దిని గాలికొదలి ప్రజల్ని ‎ కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూన్నారని ‎ టీడీపీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ మీట్ అండ్  గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... పాలన చేతకానివాడే కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. సమర్ధ నాయకుడు అభివృద్ది చేస్తాడు. వైసీపీ వాళ్లు నాకు కులం అంటగడుతున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో హైదాబాద్ ఐటి నగరంగా అభివృద్ది చేశా. అక్కడ నా కులం వాళ్లున్నారని అభివృద్ది చేశానా? నాకు కులం లేదు, మతం లేదు, నా కులం, మతం తెలుగు జాతే. తెలుగు వారంతా నా కుటుంబ సభ్యులే.  తెలుగు జాతిని ప్రపంచలో నెం.1 గా చేయాలన్నదే నా తపన. భవిష్యత్తు టెక్నాలజీదే అన్న  భావనతో నాడే ఐటీకి శ్రీకారం చుట్టాం.  ఐటీ అంటే దేశంలో మొదట గుర్తొచ్చేది హైదరాబాదే,  హైటెక్ సిటీని 14 నెలల్లో పూర్తి చేశాం. ప్రపంచమంతా తిరిగి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం.  బిల్ గేట్ ను రాష్ట్రానికి  తీసుకొచ్చి కంపెనీలు పెట్టించాం.  దాని ఫలితంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో  ప్రతి ఊరిలో ఐటి ఉద్యోగులున్నారు. 25 ఇంజనీరింగ్ కాలేజీలను 250 కాలేజీలను చేశాం. నాడు ఐటిని ప్రోత్సహించటం వల్లే నేడు ఎక్కువ మంది యువత ఐటి రంగంలో స్ధిరపడ్డారు.  


నేడు పోన్ అనే ఆయుధం ద్వారా టెక్నాలజీని ఉపయోగించి మన ఆలోచనల్ని ప్రపంచంతో పంచుకోవటం నిమిషం పని.  టెక్నాలజిని ఉపయోగించుకుని ఐటీడీపీ కార్యకర్తలు వైసీపీ పాలన వైఫల్యాలు, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. అమరావతిపై  హైకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని మీడియా చానళ్లు లాలూచీ పడి ప్రసారం చేయలేదు. అయినా ప్రజలకు తెలియకుండా ఆగిందా? ‎ఐటీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా జగన్ రెడ్డికి కోర్టు పెట్టిన చివాట్లు ప్రజల్లోకి తీసుకెళ్లలేదా?‎  కొంతమంది మీడియాను వ్యాపారంగా మర్చారు.  


రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడినా టీడీపీ హయాంలో ‎ ప్రజలకు ఏ లోటు లోకుండా పాలన చేశాం. పెట్టుబడులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేశాం. పోలవరాన్ని సోమవరంగా మార్చి  72 శాతం పనులు  పూర్తి చేశాం. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే  2020 జూన్ నాటికి పూర్తయ్యేది.  పోలవరంలో అవినీతి జరిగిందని జగన్ రెడ్డి, బ్లూ మీడియా, పేటీఎం బ్యాచ్ ‎ తప్పుడు ప్రచారం చేశారు. కానీ  పైసా అవినీతిని నిరూపించారా? సొంత బాబాయిని చంపి మొదట గుండెపోటన్నారు, తర్వాత నాపై, టీడీపీ పై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబాయిని చంపిందెవరో బయటపటంతో ఏకంగా  సీబీఐపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో రూ. 40 కోట్లు సుపారీ ఇచ్చేంత  డబ్బు ఎవరి దగ్గర ఉందో రాష్ట్ర ప్రజలకు తెలియదా?. సొంత బాబాయిని క్రూరంగా చంపుకున్నారంటే వాళ్లను ఏమనాలి?  బాబాయిని చంపిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా? వైసీపీ అంటేనే అబద్దాల పుట్ట, అవినీతికి అడ్డా. గత ఎన్నికల్లో జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయించి గెలిచారు. ఐటీడీపీ కార్యకర్తలు వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలి. 


జగన్ రెడ్డి....విద్యార్ధులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజల్ని దగా చేశారు.  వ్యవ్యస్ధలన్నింటిని ధ్వంసం చేశారు. నిన్న విజయనగరం జిల్లా డిప్యూటీ సీఎంకు చెందిన నియోజకరవర్గం కురుపాంలో పాటు కాటుతో హాస్టల్ లో  విద్యార్ధి చనిపోయాడు. మరో చోట ఆర్టీసీ డ్రైవర్ బస్సులోనే  మహిళపై అత్యాచారానికి యత్నించారు. వైసీపీ పాలనలో పరిస్ధితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?  టీడీపీ హయాంలో తప్పు చేయాలంటేనే భయపడేవారు. కానీ నేడు వ్యవస్ధలన్నింటిని విధ్వంసం చేశారు.  టీడీపీ నేతలపై, కార్యకర్తలపై, ఐటీడీపీ కార్యకర్తలపై  అక్రమ కేసులు పెట్టారు. వారు  ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు?   ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించకూడదా?  పోలీసులు జాగ్రత్తగా ఉండాలి.  అధికారులు చట్టాన్ని కాపాడితే అండగా ఉంటాం, కానీ  చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 


ఐటీడీపీ విభాగం పార్టీకి మూలస్తంభం. ఐటీడీపీ కార్యకర్తలు వైసీపీ పాలన వైఫల్యాలు ప్రజల్లోకి  తీసుకెళ్తున్న తీరు అబినందనీయం.   ‎పార్టీ కోసం పనిసేవారికి తప్పకుండా న్యాయం చేస్తాం.  వారికి అన్ని విధాల అండగా ఉంటాం. ఐటీడీపీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదును పెంచాలి. ఐటీడీపీ కార్యకర్తలు  టెక్నాలజీతో పాటు సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి. డిజిటల్ మెంబర్ షిప్ కు   శ్రీకారం చుట్టాం.  కార్యకర్తల కోసం సంక్షేమ నిధి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.  పార్టీని డిజిటల్ గా తీర్చిదిద్దాలి.   వైసీపీ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉంది. వైసీపీ వైఫల్యాల్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అక్రమ కేసులకు భయపడొద్దు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులు ఎత్తేస్తాం. ఐటీడీపీ కార్యకర్తను ‎ఎల్లప్పుడూ అండగా ‎ఉంటాం. ‎మీ ప్రాణాలకు నా ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటానని  చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments