కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది

                 

నెల్లూరు (ప్రజా అమరావతి);



పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం  అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పధకాల లక్ష్య సాధనలో  జాతీయ స్థాయిలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు  డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్  అండ్ మానిటరింగ్ కమిటీ ఛైర్మన్ శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

          

శుక్రవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జిలా స్థాయి డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్  అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ,  పేద ప్రజల జీవన ప్రమాణాలను పెంపోందించేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అభివృద్ది మరియు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని,


  ఆయా పధకాలను  జిల్లాలో పటిష్టంగా  అమలు చేసి పేద ప్రజలు అభివృద్ధి చెందేలా అధికారులు కృషి చేయాలన్నారు.   కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను  సంబంధిత శాఖల అధికారులు   జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లాలో పటిష్టంగా అమలు చేయడం జరుగుచున్నవని, 6 అంశాల్లో జాతీయ స్థాయిలో జిల్లాను ముందంజలో నిలపడం అభినందనీయమని శ్రీ  ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నారు.  జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పధకం అమలులో  జాతీయ స్థాయిలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని,  పి.ఎం.జి.ఎస్.వై లో రెండవ స్థానంలోను నిలవడంతో పాటు స్వచ్చ పర్యవేషణ్ అమలులో   నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ 10 కోట్ల రూపాయల నగదు బహుమతి అందుకోవడం జరిగిందని,  పి.ఎం. కిసాన్  జాతీయ అవార్డ్ కూడా సాధించడం ఎంతో సంతోషం అని అన్నారు. అలాగే  భూ సర్వేకు సంబంధించిచల జిల్లాలోని 160 గ్రామాల్లో  డ్రోన్ సర్వే చేపట్టి జాతీయ స్థాయిలో జిల్లా ముందంజలో నిలవడం అభినందనీయమని, ఈ సంధర్బంగా శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, అధికారులను అభినందించారు.  కోవిడ్ సమయంలో జిల్లా అధికారులు  చాలా అప్రమత్తంగా పనిచేయడం తో పాటు వ్యాక్సినేషన్లో  దేశంలో జిల్లాను ప్రధమ స్థానంలో  నిలిపారన్నారు. ఒక లక్షా 85 వేల మందికి కోవిడ్ చికిత్స అందించడం జరిగిందన్నారు.  జిల్లాకు సంబందించిన 25 మంది విద్యార్దులు  ఉక్రెయిన్ దేశంలో   విద్యను అభ్యసించేందుకు వెళ్ళడం జరిగిందని, వారిని  సురక్షితంగా స్వదేశం నకు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నవని శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 11 మందిని స్వదేశంనకు తీసుకురావడం జరిగిందని, మిగిలిన వారిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.    రాబోవు రోజుల్లో  కేంద్ర ప్రభుత్వ పధకాల అమలులో మరిన్ని అంశాల్లో జాతీయ స్థాయిలో జిల్లాను ముందజలో నిలిపేందుకు మరింత కృషి చేయాలని శ్రీ  ఆదాల ప్రభాకర్ రెడ్డి  అధికారులకు సూచించారు.


జిల్లా కలెక్టర్ మరియు  డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్  అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ అండ్ సెక్రెటరీ శ్రీ కె.వి.ఎన్.చక్రధర్ బాబు మాట్లాడుతూ,  కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు  అర్హులైన ప్రతి పేద వానికి అందించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చి  నవరత్నాల కార్యక్రమం ద్వారా  సంక్షేమ కార్యక్రమాలను  ప్రతి లబ్ధిదారునికి నేరుగా వారి ఇంటి వద్దకే చేరేలా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. జిల్లాకు సంబందించి 25 మంది విద్యార్ధులు ఉక్రెయిన్లో   వుంటున్నట్లు గుర్తించడం జరిగిందని,  ఇప్పటికే 11 మందిని సురక్షితంగా స్వదేశానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తీసుకరావడం జరిగిందని, మిగిలిన వారిని కూడా సురక్షితంగా జిల్లాకు తీసుకురావడానికి కృషిచేస్తున్నాట్లు కలెక్టర్ తెలిపారు.

          

తొలుత  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఉపాధి హామీ పధకం,  దీన్ దయాళ్ అంతోదయ యోజన, దీన్ దయాళ్  ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్య యోజన,  ప్రధాన్ మంత్రి గ్రామ సడక్  యోజన,  ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్,  ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ,  దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, నేషనల్ హెల్త్ మిషన్,  సర్వ శిక్ష అభియాన్, మిడ్ డే మిల్స్, ప్రధాన్ మంత్రి ఉజ్జ్వల  యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన  తదితర ప్రధకాల అమలు తీరును సంబంధిత శాఖల  జిల్లా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

          

ఈ సమావేశంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి పి. స్రవంతి,  జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) శ్రీ గణేష్ కుమార్, నెల్లూరు కార్పోరేషన్ కమీషనర్ శ్రీ దినేష్ కుమార్,  జాయింట్ కలెక్టర్ (ఆసరా) శ్రీమతి రోజ్ మాండ్,  జిల్లా పరిషత్ సి.ఈ.ఓ శ్రీ శ్రీనివాస రావు,  డి.ఆర్.డి.ఏ  పి.డి శ్రీ సాంబశివా రెడ్డి, డ్వామా పిడి శ్రీ తిరుపతయ్య,   హౌసింగ్ పిడి శ్రీ వేణుగోపాల్, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రమేష్, డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి, ఎస్.పి.డి.సి.ఎల్ ఎస్.ఈ శ్రీ విజయకుమార్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ శ్రీ సుబ్రమణ్యం, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఎస్.ఈ శ్రీ శ్రీనివాస కుమార్, వ్యవసాయ శాఖ జె.డి శ్రీమతి  అనందకుమారి,  మార్కెటింగ్ శాఖ ఏ.డి. శ్రీమతి రావమ్మ,   వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.





         

Comments