తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి..

 


 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న గౌ.భారత  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి..



 తిరుపతి,మార్చి 5 (ప్రజా అమరావతి);


గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నూతలపాటి వెంకటరమణ దంపతులు శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు...


అమ్మవారి దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వేదపండితులు, ఆలయ అధికారులు  పూర్ణకుంభ స్వాగతం పలకగా..

టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ జేఈవో వి. వీర బ్రహ్మం దర్శన ఏర్పాట్లు చేశారు..

    

అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థప్రసాదాలు స్వీకరించారు గౌ. భారత సుప్రీంకోర్టు   ప్రధాన న్యాయ మూర్తి...


 గౌ. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంట    

గౌ. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, గౌ. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్  లు రాజేష్ కుమార్ గోయల్, ప్రశాంత్ కుమార్ సూర్యదేవర,గౌ. హైకోర్టు జడ్జి యు. దుర్గాప్రసాద్, రిజిస్ట్రార్ డి. వెంకటరమణ, ఎ.వి రవీంద్రబాబు, జిల్లా జడ్జి వై.వి.ఎస్.బి.జి. పార్థసారథి,గౌ. మూడవ అదనపు జిల్లా జడ్జి  వీర్రాజు, గౌ. ప్రోటోకాల్ మెజి స్ట్రేట్ కోటేశ్వర రావు,డిప్యూటీ ఈవో ఝాన్సీరాణి, కోర్టు ప్రోటోకాల్ సూపరిండెంట్ ధనుంజయ నాయుడు,నాయ కులు ఎం ఆర్ సి రెడ్డి సంబంధిత అధికారులు కలరు..



Comments