పెనుగొండ, ఉండి మండలాల్లో బిజీ బిజీగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు

 


పెనుగొండ (ప్రజా అమరావతి);



పెనుగొండ, ఉండి మండలాల్లో బిజీ బిజీగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు




 రాష్ట్ర  గృహ నిర్మాణ శాఖ  మంత్రి

 చెరుకువాడ శ్రీరంగనాథరాజు  ఆదివారం మంత్రివర్యులు స్వగ్రామము మైనటువంటి

 ఉండి మండలం యండగండి గ్రామం  లో నూతన నిర్మాణం లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ వారి దేవస్థానము  ఏప్రిల్ 17న ప్రారంభ మహోత్సవ కార్యక్రమంలో  భాగంగా  నిర్మాణ దశలో ఉన్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్  ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు


 అంతకుముందు పెనుగొండ గ్రామంలో దేవ రోడ్డు అడ్డపుంత వద్ద వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయం సప్తమ వార్షికోత్సవ మహోత్సవ  కార్యక్రమంలో  పాల్గొని ప్రత్యేక పూజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 

గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నిర్వహించారు.


: కవిటం గ్రామంలో దాతలు సహకారంతో నిర్మించిన  డాక్టర్ వాటర్  ప్లాంట్ ను   ప్రారంభించిన మంత్రివర్యులుచెరుకువాడ శ్రీరంగనాథరాజు , తదితరులు పాల్గొన్నారు.


 పెనుగొండ, SVKP  కాలేజ్,  రోటరీ క్లబ్ వారి ఇన్నర్ వీల్ జిల్లాల 302 వ మల్టీ జోనల్ మీట్ సమ్మేళనంలో  మంత్రివర్యులు

 చెరుకువాడ శ్రీరంగనాథరాజు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు అభివృద్ధి లోను, సంక్షేమం లోను, రాజకీయా, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పైగా ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. జగనన్న మహిళా పక్షపాతిగా ప్రతి అడుగులో మహిళా సాధికారత సాధించేలా అడుగులు వేస్తోందన్నారు. మహిళల్లో ఉన్న ప్రతిభను చాటుకునేందుకు వేదిక గా మల్టీ జోనల్ మీట్ సమ్మేళనం ను నిర్వహించిన నిర్వాహకులను మంత్రి అభినందించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Comments