డిప్యూటీ తహసీల్దార్ (రీసర్వే ) గా డిటి లకు ప్రత్యేక అధికారములు.. ఆర్డీవో ఎస్. మల్లిబాబు

 


కొవ్వూరు (ప్రజా అమరావతి): 



డిప్యూటీ తహసీల్దార్ (రీసర్వే ) గా డిటి లకు ప్రత్యేక అధికారములు.. ఆర్డీవో ఎస్. మల్లిబాబు


తహసీల్దార్ కార్యాలయల పరిధిలో పనిచేసే డిప్యూటీ తహశీల్దార్ లకు రీసర్వే ను వేగవంతం చెయ్యడానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారం ఇస్తూ డిప్యూటీ తహసీల్దార్ (రీసర్వే ) గా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగిందని కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు సోమవారం ఒక ప్రకటన లో తెలిపారు.


రాష్ట్ర ప్రభుత్వ సీసీఎల్ఏ కమీషనర్ ఇందుకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికి ఇళ్ళు, జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం అమలులో వివాదాల పరిష్కారం కోసం ఈ ఉత్తర్వులు ద్వారా త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం సాధ్యం కానున్నదని పేర్కొన్నారు.  ఇప్పటికే డిప్యూటీ తహశీల్దార్ లు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, మండల మొబైల్ మేజిస్ట్రేట్ అధికారములు కలిగి ఉన్నారు.  ప్రస్తుత ఉత్తర్వులు నేపథ్యంలో డిప్యూటీ తహశీల్దార్ రీసర్వే ఏపీ రీసర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 అధికారములు, ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాదారు పాస్ బుక్ 1971 మరియు 1989 మేరకు నమోదు అధికారములు కల్పించడం జరిగిందని మల్లిబాబు తెలిపారు. సెంట్రల్ యాక్ట్ 2 ఆఫ్ 1974 అనుసరించి  కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 లో నిర్దేశించిన అధికారములు డిటి లకు కల్పించడం జరిగిందన్నారు.




Comments