జిల్లా పరిషత్తు హైస్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీరంగనాధ్ రాజు

 


పెనుగొండ (ప్రజా అమరావతి);   జిల్లా పరిషత్తు హైస్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీరంగనాధ్ రాజురాష్ట్ర ముఖ్యమంత్రి విద్య కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడం జరుగుతొందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేర్కొన్నారు.


బుధవారం ఉదయం చెరకువాడ గ్రామంలోని జిల్లా పరిషత్తు హైస్కూల్ ని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాధ్ రాజు మాట్లాడుతూ, ప్రవేటు పాఠశాలలకు ధీటుగా నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించడం తో పాటు మౌలిక సదుపాయాల పైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. నేడు ఆంగ్ల భోదన సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకుని వొచ్చిన ఘనత జగనన్న కి దక్కిందన్నారు. పాఠశాల లో అందిస్తున్న  మధ్యాహ్న భోజనం పై  స్కూలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు,  మధ్యాహ్న  భోజనం ను వంటశాల వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితి ని పరిశీలించారు.  విద్యార్థులతో ఇంగ్లీష్ , తెలుగు లో విద్యా బోధన గురించి  మాట్లాడారు.  విద్యార్థులందరూ పాఠశాలకు హాజరవుతున్న రా ? అని ఉపాధ్యాయు లను అడిగి తెలుసుకున్నారు. ఒక్క డ్రాప్ అవుట్ లేకుండా చూడాలని కోరారు. రెండో విడత లో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ స్కూల్ లో కొత్తగా 20 క్లాస్ రూమ్  లను మంజూరు చేశారు. జిల్లా పరిషత్తు స్కూల్ ప్రాంగణంలో క్లాస్ రూమ్  కోసం అనువైన స్థలాన్ని మంత్రి పరిశీలించడం జరిగింది. హాజరు పట్టిక, వంట గది, మరుగుదొడ్లు లను తనిఖీ చేశారు.


మంత్రి వెంట పాఠశాల కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


అనంతరం తిరుగు ప్రయాణంలో పెనుగొండ

మార్టేరు - పెనుగొండ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన  త్వరితగతిన పనులు పూర్తి చెయ్యాలని  అధికారులకు తగిన సూచనలు చేశారు.