SPS నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);
ప్రేమోన్మాదిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు
వెంకటగిరి పట్టణములో ఇంటర్ మీడియట్ చదువుతున్న మైనర్ బాలిక గొంతు కోసిన యువకుడు.
గతంలో చనువుగా ఉండి, ప్రస్తుతం అతనిని ప్రేమించలేదని ఘాతుకానికి పాల్పడిన ముద్దాయి.
సదరు ప్రాంతంలోనే నివసించే ముద్దాయి బాలికను వసంచేసుకోవాలనే నెపంతో దగ్గరయిన ముద్దాయి..
విషయం తెలుసుకున్న ముద్దాయిని మందలించిన బాలిక తల్లిదండ్రులు
నిందితుడు తరచూ బాలికను వెంబడిస్తూ తనతో మాట్లాడాలని వేదిస్తున్న నిందితుడు.
కక్ష్య పెంచుకొని చంపాలనే నెపంతో ఇంటిలోనికి ప్రవేశించి దాడి చేసిన ముద్దాయి.
వెంకటగిరి పట్టణములోని విశ్వోదయ కళాశాల నందు ఇంటర్మీడియట్ 2 వ సంవత్సరము చదువుచున్న బాలిక.
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యువకుడు.
నేరము జరిగిన వెంటనే స్పందించి, సంఘట స్థలానికి చేరుకొని బాలికను ఆసుపత్రికి తరలించిన పోలీసులు.
వెంటనే బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసిన వెంకటగిరి పోలీసులు.
మహిళల రక్షణ, భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం..
ముద్దాయిపై హత్యాయత్నం, పోక్సో కేసు నమోదు.
నిందితుడిని చట్టప్రకారం శిక్షించేలా అన్ని చర్యలు..
ముద్దాయి వివరాలు: రాగిపాటి చెంచుకృష్ణ, తండ్రి మణి, వయస్సు 29 సంవత్సరాలు, కులం: SC మాల, కాలేజి మిట్ట, వెంకటగిరి టౌన్.
కేసు వివరాలు: Cr.No.48/2022 u/s 354-D, 452, 324, 307 IPC, Sec.10 r/w 9 (i) and Sec.12 of POCSO Act.2012 of Venkatagiri PS
జరిగిన సంఘటన:
వెంకటగిరి పట్టణము అమ్మవారిపేటకు చెందిన మైనర్ బాలిక వెంకటగిరి పట్టణములోని విశ్వోదయ కళాశాల నందు ఇంటర్మీడియట్ 2వ సంవత్సరము చదువుచున్నది. అదే ప్రాంతానికి చెందిన రాయపాటి చెంచు కృష్ణ, వయస్సు 21 సం. అనే యువకుడు కొన్నాళ్లుగా ఆ బాలిక వెంటపడుచూ తనను ప్రేమించాలని ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడు. దానికి ఆ బాలిక అంగీకరించక పోవడంతో ఆ బాలిక పై కక్ష పెంచుకున్నాడు. తన ప్రేమను అంగీకరించక పోగా, ఇతరులతో మాట్లడుతున్నదని అనుమానం పెంచుకొని ఆ బాలికను బెదిరించుచున్నట్లు, ఈ విషయమై ఈ దినము అనగా తేది 21.03.2022 ఉదయం సుమారు 7.45 గంటల సమయములో, యువకుడు రాయపాటి చెంచు కృష్ణ బాలిక ఇంటిలోనికి అక్రమంగా ప్రవేశించి, బాలికను మంచం మీద నెట్టి జుట్టు పట్టుకొని చైనా బ్లేడ్(పేపర్ కటర్) తో యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు.
చేధన: సమాచారం తెలిసిన వెంటనే జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు, IPS., గారు స్పందించి, గూడూరు DSP శ్రీ రాజగోపాల్ రెడ్డి గారికి, వెంకటగిరి ఇంచార్జ్ CI శ్రీ శ్రీనివాస రెడ్డి గారికి మరియు వేంకటగిరి SI శ్రీ కోటి రెడ్డి గారికి తగిన సూచనలు చేసి వెంటనే బృందాలని ఏర్పాటు చేయడమైనది. జిల్లా యస్.పి. గారి ఆదేశాల మేరకు గూడూరు DSP గారి పర్యవేక్షణలో C.I. గారు, వేంకటగిరి S.I. గారు వారి సిబ్బంది ముమ్మరంగా గాలించి నేరమునకు పాల్పడిన రాయపాటి చెంచు కృష్ణను వెంకటగిరి RTC బస్-స్టాండ్ వద్ద అరెస్ట్ చేయడమైనది.
అభినందనలు: నేరము జరిగిన వెంటనే స్పందించి ముద్దాయిని గంటల వ్యవధిలోనే పట్టుకున్న వెంకటగిరి ఇంచార్జ్ C.I. శ్రీ శ్రీనివాస రెడ్డి గారిని, వెంకటగిరి S.I. శ్రీ కోటి రెడ్డి మరియు వారి సిబ్బందిని జిల్లా యస్.పి. గారు అభినందించి రివార్డులు అందజేసినారు.
addComments
Post a Comment