విజయవాడ (ప్రజా అమరావతి);
మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న మార్గం, దిశను సద్వినియోగం చేసుకునేలా మహిళా విజయోత్సవ సభ
ను నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత అన్నారు.
ఈనెల ఎనిమిదో తేదీ మంగళవారం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించే మహిళా విజయోత్సవ సభకు చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మంత్రి శ్రీమతి తానేటి వనిత, ఏపి ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ, శాసనమండలి సభ్యులు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం,శాసనసభ్యులు మల్లాది విష్ణులతో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా పక్షపాతిగా మహిళలకు చేసిన సేవలను ఈ సభలో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని మంత్రి అన్నారు. నేడు ఎంతో మంది మహిళలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయన అందిస్తున్న సంక్షేమం వల్ల ఎంతోమంది లబ్ధి పొందుతున్నారని మంత్రి అన్నారు. ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు మారి ఎంతో సంతోషంగా ఉంటున్నారని మంత్రి అన్నారు. ఈ విజయోత్సవ సభకు హాజరయ్యేందుకు ఎంత మంది మహిళలు ఉత్సాహం చూపుతున్నారని మంత్రి అన్నారు. ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని గతంలో పనిచేసిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు పెద్దపీట వేస్తామని మాటలలో చెప్పి చేతలలో వారికి నిరాశే మిగిల్చాయి అని అన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మహిళా సాధికారత సాధించే దిశగా వారికి అన్నగా, తమ్మునిగా అండగా ఉంటున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనిస్తున్నారన్నారు. నేడు ఎంతోమంది మహిళలు ప్రభుత్వం కల్పిస్తున్న సంక్షేమ పథకాల వల్ల వారు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు, వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుంటున్నారని అన్నారు. చేయూత పథకం ద్వారా పారిశ్రామిక యూనిట్లను నెలకొల్పకొని మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అండగా ఉందన్నారు. డ్వాక్రా మహిళలకు చేయూత పథకం ద్వారా పారిశ్రామికవేత్తగా సాధికారత సాధించే దిశగా అడుగులు వేయడం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చక్కటి నిర్ణయాలతో ఎంతోమంది మహిళల జీవితాలలో మార్పులు వచ్చాయని అన్నారు. ఇలాంటి అభివృద్ధి గతంలో ఎప్పుడూ చూడలేదని మహిళలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాజకీయంగా, ఆర్థికంగా ఎంతగానో చేయూత అందించి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలపై తమ సంతోషం వ్యక్తం చేయాలని ఈ వేదిక ద్వారా మహిళలు ఎంతో ఉత్సాహం చూపుతున్నారని మంత్రి అన్నారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల పక్షాన తీసుకుంటున్న నిర్ణయాలు, అందిస్తున్న పాలనకు ఈ వేదిక గొప్ప వేదిక కానుందని మంత్రి తానేటి వనిత అన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ మార్చి 8 వ తేదీ మహిళా దినోత్సవాన్ని విజయోత్సవ సభగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని, ప్రతి పథకాన్ని మహిళలకు ఉద్దేశించి పెట్టినదే కావడం గమనార్హం అన్నారు. మహిళా శిశు సంక్షేమం, మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఈ వేడుక ద్వారా మహిళలు తమ సంతోషాన్ని వ్యక్తం చేయనున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.
అనంతరం సభకు చేస్తున్న ఏర్పాట్లను అధికారులతో మంత్రి సమీక్షించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి తానేటి వనిత అధికారులను ఆదేశించారు.
ఏర్పాట్ల పరిశీలనలో శాసనమండలి సభ్యులు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, శాసనసభ్యులు మల్లాది విష్ణు వర్ధన్, జాయింట్ కలెక్టర్లు డాక్టర్ కె మాధవి లత,మోహన్ కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్,డిసిపి హర్ష వర్ధన్ రాజు, తదితరులు ఉన్నారు.
addComments
Post a Comment