వినియోగదారుల రక్షణ కోసం నూతన చట్టం


వినియోగదారుల రక్షణ కోసం నూతన చట్టం 


ప్రతి ఒక్కరికి అవగహన అవసరం 

 బాధ్యత లేని సంస్థల పై చర్యలు తప్పవు 

మార్చ్ 15 న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం 

జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి 

విజయనగరం, మార్చి 14 (ప్రజా అమరావతి):  వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం గత  జూలై  నుండి అమలులోకి వచ్చిన చట్టంలో వినియోగదారులకు ఎక్కువగా అధికారాలు ఉన్నాయని  జిల్లా కలెక్టర్ ఎ.సూర్య కుమారి తెలిపారు.  మార్చి నెల 15 న వినియోగదారుల దినోత్సవం సందర్భంగా  సోమవారం  ఒక ప్రకటన విడుదల చేసారు.  ప్రతి ఒక్కరికీ వినియోగ దారుల రక్షణ చట్టం లోని అంశాల పై అవగాహన కలిగి ఉండాలని ఆ ప్రకటన లో  తెలిపారు.   వినియోగదారుడు  ఏ వస్తువు కొన్నా, ఏ సేవ పొందినా అది వినియోగదారునికి ఉపయోగ పడాలే కానీ హాని కలిగించరాదని , వాటి వలన  పూర్తి భద్రత ఉండాలని పేర్కొన్నారు.  అలా పొందని పరిస్థితి లో  చట్టం ప్రకారంగా .   వినియోగదారునికి  నష్ట పరిహారం పొందే హక్కు ఉందని తెలిపారు. 

వినియోగదారుల వివాదాలను పరిష్కరించడానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి లలో మూడంచెల పద్ధతి లో మూడు కమిషన్లు  ఉన్నాయని పేర్కొన్నారు. రూ. 12.50 లక్షల విలువైన వివాదాలను జిల్లా స్థాయిలో, 2 కోట్ల విలువైన వివాదాలను రాష్ట్ర స్థాయి లో, ఆ పై విలువ కలిగిన వివాదాలను జాతీయ స్థాయి లో పరిష్కరిచబడతాయని వివరించారు.    ఉత్పత్తి చేసిన వస్తువుల పట్ల బాధ్యత లేని సంస్థల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని , ఈ-కామర్స్ , ఆన్లైన్ అమ్మకాలు, కొనుగోళ్ళ లో జరుగుతున్న మోసాలు అరికట్టబడతాయని అన్నారు.  అదే విధంగా నకిలీ వస్తువుల విక్రయం పై జరిమానా విధించడం జరుగుతుందని , ఫిర్యాదులు వినియోగదారుల కోర్ట్ లందు సమీక్షించి తగిన తీర్పులు చెప్పబడతాయని  తెలిపారు. అంతే కాకుండా అన్యాయమైన వాణిజ్య పద్ధతులను,  తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టడం జరుగుతుందని తెలిపారు. వినియోగదారులకు సమస్య ఎదురైతే ఎలా పరిష్కరించుకోవాలి, ఎవరిని కలవాలి, దీని కోసం పని చేసే సంస్థలు ఏంటి అనే విషయాల పై అవగాహన కలిగించడానికి  విద్యా సంస్థల్లో కూడా కన్స్యూమర్ క్లబ్ లను ఏర్పాటు చేసి వాటి ద్వారా  ఈ చట్టం  పని తీరు , చట్టం లోని అంశాల పై అవగాహన కలిగించడం జరుగుతోందని అన్నారు.  ప్రజలంతా వినియోగాదారులేనని , తమ వినియోగ దారులకు  చట్టం లోని అంశాల పై విస్తృతంగా అవగాహన కలిగించేలా ప్రతి సంస్థా పని చేయాలనీ అన్నారు. 


నేడు మహిళా ప్రాంగణం లో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం: 

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళా ప్రాంగణం లో  మంగళవారంజిల్లా యంత్రం తరపున  ఉదయం 10 గంటల నుండి పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు  జిల్లా  కలెక్టర్ ఎ. సూర్య కుమారి తెలిపారు.  ఈ కార్యక్రమం లో వినియోగదారుల ఫోరంనకు చెందిన అధ్యక్షులు, సభ్యులు పాల్గొని  చట్టం పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ  సందర్భంగా లీగల్ మెట్రోలజి , వైద్య ఆరోగ్య శాఖ, ఆహార భద్రతా సంస్థల ఆధ్వర్యం లో పలు స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, ఆసక్తి కలవారంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. 


Comments