*గృహప్రవేశాలకు సర్వం సిద్ధం చేయండి*
*430 చదరపు అడుగులకు సంబంధించి 560 ఇళ్లను ఈ నెల ఆఖరికి అన్ని వసతులతో లబ్దిదారులకు అందించనున్నాం*-*ఎమ్మెల్యే విడదల రజిని*
*మౌళిక వసతుల కల్పనలో రాజీ వద్దు*
*టిడ్కో ప్రాంగణమంతా పచ్చదనంతో నిండాలి*
*ఈ ప్రాంతం మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేపట్టండి*
*చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని ఆదేశాలు*
*నెలాఖరుకు టిడ్కో ఇళ్ల పంపిణీ నేపథ్యంలో ఎమ్మెల్యే పర్యటన*
*హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, అధికారులతో ప్రత్యేక సమావేశం*
చిలకలూరిపేట (ప్రజా అమరావతి); టిడ్కో వసతి సముదాయంలో గృహ ప్రవేశాలకు అధికారులు సర్వం సిద్ధం చేయాలని చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల రజిని టిడ్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని టిడ్కో వసతి సముదాయాన్ని శనివారం ఎమ్మెల్యే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్నకుమార్, టిడ్కో ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 430 చదరపు అడుగులకు సంబంధించి 560 ఇళ్లను ఈ నెలాఖరుకు లబ్ధిదారులకు అందించబోతున్నామని చెప్పారు. ఈ నెలాఖరుకు ఇళ్లను లబ్ధిదారులకు ఇస్తుండటంతో అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. డ్రెయిన్లు, కరెంటు, మంచినీరు లాంటి మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని చెప్పారు.
*రూ.5 కోట్లతో ఎస్టీపీ*
మురుగునీటి వ్యవస్థకు సంబంధించి టిడ్కో ఇళ్ల వద్ద ఎలాంటి మురుగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు రూ. 5 కోట్ల వ్యయంతో ఎస్టీపీ ట్యాంకును నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
*వెంటనే జంగిల్ క్లియరెన్స్ పనులు*
ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ టిడ్కో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకూడదని, వెంటనే ఈ ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఇన్ చార్జి కమిషనర్ రహీమ్ మాట్లాడుతూ వసతి సముదాయంలో నివసించేవారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రాంతం మొత్తం రెండు రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ చేస్తామన్నారు. మంచినీటి సమస్య తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
*ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలిః ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్నకుమార్*
ప్రభుత్వం పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరారు. టిడ్కో లబ్ధిదారులకు విజయవంతంగా వారి ఇళ్లు వారికి అప్పగించేలా చేయడంలో అధికారుల చొరవ ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్లు, టిడ్కో ఈఈ ఇ.ప్రసాదరావు, డీఈ ఎన్.వెంకటాద్రి, మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్లు వలేటి వెంకటేశ్వరరావు,కొలిశెట్టి శ్రీనివాసరావు,మార్కెట్ యార్డు చైర్మన్ ఎం.విశ్వనాథం,పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహ ఖాన్,జడ్పీటీసీ ముక్తా వాసు, ప్రధాన కార్యదర్శి మారుబోయిన నాగరాజు,రాష్ట్ర 15 వ ఆర్ధిక సంఘ సభ్యులు వడితే కోట నాయక్,సొసైటీ అధ్యక్షులు తోట బ్రహ్మాస్వాములు,కాట్రు రమేష్, కౌన్సిలర్లు బేరింగ్ మౌలాలి,తులం సుధాకర్, షేక్ మీరాబీ,పుల్లగూర అనురాధ,షేక్ నసీమ,షేక్ నాయబ్ సైదాబీ,చెంబేటి భారతి,అన్నపురెడ్డి శ్రీలక్ష్మి,మొలకలూరి బాజీ మున్ని,షేక్ యూసుబ్,షేక్ ఖాజా భాను,కొచ్చెర్ల విజయలక్ష్మి,బిట్రా రాజేంద్ర,కో ఆప్షన్ సభ్యులు పోలిశెట్టి మస్తాన్,నాయకులు కందుల శ్రీకాంత్,పంగులూరి రాయుడు,బండారు జయ,మోషే,శొంఠి శ్రీను,ఇక్కుర్తి పవన్,నాగబైరు వెంకట్,గోరంట్ల ఉమా,మరియు పలువురు పాల్గొన్నారు.
addComments
Post a Comment