*కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవం*
విద్యార్థులు పరీక్ష బోధనకు సిద్ధంగా ఉండాలి - జాకోబ్ విక్టర్.
తాడేపల్లి (ప్రజా అమరావతి);
కెఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఈసిఈ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే 'జోత్రీయ-22' పేరిట నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక ఉత్సవాన్ని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్.జాకోబ్ విక్టర్ ముఖ్యఅతిధిగా హాజరయ్యి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ప్రస్తుత పరిస్థితులను బట్టి విద్యార్థులు ప్రత్యక్ష, పరోక్ష విద్యా బోధనకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఆ దిశగా సాంకేతిక పరిజ్ఞానాన్ని సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఇటువంటి జాతీయ స్థాయి సాంకేతిక సదస్సులు, ప్రసంగాలకు హాజరు కావడం వలన కంపెనీల ప్రాంగణ ఎంపికల్లో ఎంతో ఉపయోగపడతాయని ఆయన సూచించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు రెండు వేలమందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు టెక్నికల్ వర్క్ షాపులు, ఆన్ లైన్ వెబినార్లు, ఆహ్లాద భరితమైన సాంస్కృతిక క్రీడలు, నృత్య, సంగీత భరితమైన ప్రోషో వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లు సదస్సు చైర్మన్ డాక్టర్ ఎం. సుమన్ పేర్కొన్నారు. ఈ జాతీయ స్థాయి సంకేత ఉత్సవంలో టెక్నాలజీ మ్యానేజింగ్ పార్టనర్ ప్రసాదరావు, ప్రో ఛాన్సలర్ డాక్టర్ జగన్నాధరావు, రిజిస్ట్రార్ డాక్టర్ వై.వి.ఎస్.ఎస్.ఎస్.వి.ప్రసాదరావు, ఈవెంట్ మేనేజర్ డాక్టర్. కెసిహెచ్. శ్రీకావ్య, ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సుబ్బారావు, డీన్ లు డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ శ్రీనాథ్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ హబీబుల్లా ఖాన్, డైరెక్టర్ డాక్టర్ శరత్, కో కన్వీనర్ పి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
addComments
Post a Comment