శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ని దర్శించుకున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్పోలవరం (పట్టిసం) (ప్రజా అమరావతి);


శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ని దర్శించుకున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్మహా శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి విచ్చేసే భక్తులకు త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ వి.ప్రసన్న వెంకటేష్ స్పష్టం చేశారు.


మంగళవారం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ని దర్శించుకుని పూజలు నిర్వహించిన కలెక్టర్ అనంతరం మెరుగైన ఏర్పాట్లు విషయం పై  భక్తులను ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలు గా కరోనా నేపథ్యంలో భక్తులు తాకిడి ఎక్కువగా ఉందన్నారు. ఇప్పటికే పట్టిసం కి విచ్చేసే భక్తుల కోసం రెండు లక్షల వాటర్ ప్యాకెట్లు, హాండ్ బోర్ లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న దృష్ట్యా మరో రెండు లక్షల వాటర్ ప్యాకేట్స్ అందుబాటులో ఉంచాలని ఆర్డీవో ను ఆదేశించారు. ఈక్రమంలో క్యూ లైన్ లో ఉన్న భక్తులతో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, మరింత మెరుగైన సేవలు అందించేందుకు అధికారులకు దిశానిర్దేశం చేశారు.


తొలుత పట్టిసం కి చేరుకున్న కలెక్టర్ కి ఆర్డీవో , బోట్ ద్వారా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న కలెక్టర్ కి అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి  ఇతర అధికారులు స్వాగతం పలికారు. తదుపరి ఆలయానికి చేరుకున్న కలెక్టర్ కి ఆలయ పూజారులు,  దేవాదాయ శాఖ అధికారులు మేళా తాళాలు , పూర్ణ కుంభం తో ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. స్వామి వారి సన్నిధిలో పూజాధి కార్యక్రమాలు నిర్వహించి అయ్యవార్ల ఫొటో, శేష వస్త్రం, ప్రసాదం అందచేశారు. ఆలయ ప్రాంగణంలో వేంచేసిఉన్న శ్రీ భావన్నారాయణ స్వామిని, ఇతర మూల విరాట్ లను దర్శించి పూజాధికాలు నిర్వహించారు. 


ఈపర్యటన లో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో వి.ప్రసన్న లక్ష్మి, డిఎస్పీ కె. లతా కుమారి, డివిజనల్ పిఓ ఎమ్. బాలామణి, తహసీల్దార్ బి. సుమతి, దేవస్థానం అధికారులు,  ఇతర అధికారులు పాల్గొన్నారు.