శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):


    శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి(జీర్ణోద్ధరణ) పనులలో భాగంగా ఈరోజు అనగా ది.21-03-2022 న శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి  డి.భ్రమరాంబ గారి సమక్షంలో ఆలయ స్థానాచార్యులు వారి ఆధ్వర్యంలో ప్రధానార్చకులు మరియు అర్చక సిబ్బంది శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయం నందు స్వామి వారికి కళాపకర్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ నటరాజ స్వామి వారి ఆలయం వెనుక ఉన్న బాలాలయము నందు శ్రీ మల్లేశ్వర స్వామి వారి స్థాపన కార్యక్రమము శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగినది. కావున శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయమునందు స్వామి వారి దర్శనం నిలుపుదల చేసి,  బాలాలయం నందు శ్రీ స్వామివారి దర్శనం చేసుకోనుటకు అధికారులు చర్యలు తీసుకొనడం జరిగినది. శ్రీ మల్లేశ్వరస్వామి వారికి జరుగు నిత్య సేవలు అన్నియూ బాలాలయము నందు నిర్వహించబడును. కావున భక్తులు ఈ విషయమును గమనించవలసినదిగా కోరడమైనది.

 

మరియు శ్రీమల్లేశ్వర స్వామి వారి ఆలయము వద్ద ఆలయ అర్చక సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, అభివృద్ధి పనులు వెంటనే ప్రారంభించడం జరిగినది. శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగముగా నిర్వహించి వీలైనంత త్వరగా భక్తులకు స్వామి వారి దర్శనం యధావిధిగా శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయములో  కల్పించుటకు చర్యలు తీసుకొనవాల్సినదిగా కార్యనిర్వహణాధికారి వారు అధికారులను ఆదేశించియున్నారు.

Comments