విజయవాడ (ప్రజా అమరావతి);
*జాతీయ రహదారుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.12,123 కోట్ల నిధుల మంజూరు*
రాష్ట్రంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ రహదారుల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం రూ.12,123 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి. కృష్ణబాబు తెలియజేసారు. 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ (MoRTH) ద్వారా ఈ నిధులు మంజూరైనట్లు ఆయన వివరించారు. గత ఏడాది MoRTH వార్షిక ప్రణాళికలో రాష్ట్రానికి 6,530 కోట్లు కేటాయించినప్పటీకీ రూ. 7,865 కోట్లు మంజూరు చేయించుకోగలిగామని, భారతదేశంలోని ఏ రాష్ట్రంతో పోల్చినా ఇది అత్యధికమని ఆయన చెప్పారు.
నేషనల్ హైవే ఆధారిటీ ఆఫ్ ఇండియా చేపడుతున్న పనులతో పాటు ఈ సంవత్సరంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులు పొందేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని ఎం.టి. కృష్ణబాబు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో నిరంతరం సంప్రదింపులు జరిపి ఒప్పించడంతోనే ఇదంతా సాధ్యమైందని ఆయన అన్నారు.
ఈ ప్రాజెక్టులు ఇండస్ట్రియల్ నోడ్స్, ఎకనామిక్ జోన్లు మరియు పర్యాటక ప్రదేశాల నుండి కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని కృష్ణ బాబు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మరింత పన్ను రాబడిని అందించడమే కాకుండా లాజిస్టిక్ సామర్థ్యాన్ని మరియు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు. ఈ ఏడాదిలోగా అన్ని ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేసేందుకు వీలుగా డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేయడంతో పాటు భూసేకరణ పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
addComments
Post a Comment