*రాష్ట్ర ప్రభుత్వం జి.డి నెల్లూరు నియోజక వర్గంలో దేవాలయాల అభివృద్ధికి రూ. 13 కోట్లు వెచ్చిoచడం జరిగింది.*
*:గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి*
*రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి కి కృషి చేస్తోంది.*
*:గౌ. జెడ్పీ ఛైర్మన్*
జిడి నెల్లూరు, ఏప్రిల్ 13 (ప్రజా అమరావతి);
గంగాధర్ నెల్లూరు నియోజక వర్గంలో దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర రూ.13 కోట్లు వెచ్చిoచడం జరిగిందని గౌ. రాష్ట్ర ఉపముఖ్య మంత్రి మరియు ఎక్సైజ్ శాఖమాత్యులు కె. నారాయణ స్వామి పేర్కొన్నారు...
బుధవారం గంగాధర్ నెల్లూరు మండలం పెద్ద కుంట పల్లి లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ శ్రీ శ్రీ కనుగొండ రాయ స్వామి వారి ఆలయ నిర్మాణమునకు గౌ.రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు భూమి పూజ చేశారు... ఈ కార్యక్రమంలో గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తో పాటు గౌ. జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,గౌ. రాష్ట్ర విదేశీ వ్యవ హారాల ప్రభుత్వ సలహాదారు జ్ఞానేం ద్రరెడ్డి, మాజీ దేవా దాయ శాఖ మాత్యు లు వెల్లం పల్లి శ్రీని వాస్,ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయా నంద రెడ్డి,తది తరు లు పాల్గొన్నారు...
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గౌ. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ప్రజలనుద్దే శించి మాట్లాడుతూ గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి వై..ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రతి పేదవాడు విద్యా వంతుడు కావడానికి తపన పడు తున్నా రని.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నారన్నారు.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో దేవాలయాల అభి వృద్ధికి గౌ. రాష్ట్ర ముఖ్య మంత్రి ఎంతో సహకారం అందించారని మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పురాతన దేవాలయాల నిర్మాణానికి ఎంతో కృషి చేశారన్నారు.. ప్రస్తుతం నిర్మిస్తున్న ఈ దేవాలయ నిర్మా ణానికి ప్రభుత్వం రూ.2 కోట్ల 63 లక్షల మంజూరు చేసిందని దీనితోపాటు తన నియోజకవర్గంలో ఎన్నో దేవాలయా లను అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు..
గౌ. జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చ యంతో దేవాలయా ల అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
గౌ. రాష్ట్ర విదేశీ వ్యవహారాల ప్రభు త్వ సలహాదారు మాట్లాడుతూ గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం తో పాటు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు..
మాజీ దేవాదాయ శాఖ మాత్యులు మాట్లాడుతూ గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పురాతన దేవాలయాల అభి వృద్ధికి మరియు భూముల పరిరక్షణ కు కృషి చేశారన్నారు భగవంతుని ఆశీ స్సులతో మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి సారి కేబినెట్ లో దేవా దాయ శాఖ మంత్రి గా నియామకం చేయడం తో దేవాల యాల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు
ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో దేవాలయాల అభి వృద్ధికి రాష్ట్ర ప్రభు త్వ నిధులతో పాటు టిటిడి కూడా ఆల యాల అభివృద్ధికి కృషి చేస్తోందన న్నారు..
*ఈ కార్యక్రమం లో భాగంగా వెదురు కుప్పం మండలం బుచ్చిరెడ్డిపాలెం నకు చెందిన ఎన్ ఆర్ ఐ వాసుదేవ రెడ్డి సతీ మణి దీప కనుగొండ రాయ స్వామి ఆలయ నిర్మాణం కొరకు ఒక లక్ష రూపాయలు, వెదురుకుప్పం డిగ్రీ కళాశాల నిర్మాణం కొరకు 2 లక్షల రూపాయలు మొత్తం 3 లక్షల రూపాయల కు సంబంధించిన చెక్కు ను మంత్రి గారికి అందజేశారు...*
ఈ కార్యక్రమంలో చిత్తూర్ ఆర్డీఓ రేణుక, గంగాధర్ నెల్లూరు తహసీల్దార్ ఇన్బ నాదన్, పెను మూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్మయ రెడ్డి,
ఎంపీడీఓ శ్రీదేవి, ఎంపీపీ అనిత, జడ్పిటిసి లక్ష్మయ్య, డిప్యూటీ మేయర్ రాజేష్, ఎంపిటిసి యశోద, సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు...
addComments
Post a Comment