రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
ఏప్రిల్ 16 న హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ తూర్పుగోదావరి జిల్లా పర్యటన
గౌరవనీయులైన హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రయ ది. 16/04/2022 (శనివారం) ఉదయం 11.15 గంటలకి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, శంషాబాద్, హైదరాబాద్ నుండి బయలుదేరి మ.1.00 గంటలకు రాజమండ్రి విమానాశ్రయం చేరుకొని, మ.1.30 కి , తారకరామ నగర్, లాలాచెరువు, స్పిన్నింగ్ మిల్స్ సమీపంలోని మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నివాసానికి చేరుకుంటారు. అనంతరం మ. 2.30 కి అక్కడ నుంచి బయలుదేరి మ.3.00 గంటలకి సర్క్యూట్ హౌస్ కి చేరుకొని విశ్రాంతి తీసుకుంటారు. తిరిగి అక్కడ నుంచి సా.4.00 లకి బయలుదేరి సా.4.30 కి త్యాగరాజ భవన్, రాజమండ్రి నందు మైత్రి ఫౌండేషన్ ద్వారా పౌర సత్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సా.6.00 గం బయలుదేరి సా.6.30 కి సర్క్యూట్ హౌస్ చేరుకొని, అక్కడ నుంచి సా.6.40 కి బయలు దేరి రా.7.10 గంటలు జె.కె. గార్డెన్స్, జవహర్ లాల్ నెహ్రు రోడ్, రాజమండ్రి కి చేరుకొని వివాహ వేడుకల్లో పాల్గొంటారు. తిరిగి అక్కడ నుంచి రా.8.00 కి బయలుదేరి రా.8.45 కి రాజమండ్రి విమానాశ్రయం చేరుకొని రా.9.15కి హైదరాబాద్ బయలుదేరి వెళతారు.