రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
పెట్రోలియం ఉత్పత్తుల పరి రక్షణ కై గెయిల్ వారి ఆధ్వ ర్యంలో "సాక్షం సైక్లో థాన్- 2022" సైకిల్ ర్యాలీ నీ ప్రారంభించిన ముఖ్య అతిధి జైలు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్. రాజారావు.
పర్యావరణ పరిరక్షణ కై ప్రతీ ఒక్కరూ పాటుపాడలని జైల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్. రాజారావు అన్నారు.
ఆదివారం పెట్రోలియం ఉత్పత్తుల పరిరక్షణ కై గెయిల్ వారి ఆధ్వ ర్యంలో "సాక్షం సైక్లో థాన్- 2022" సైకిల్ ర్యాలీ నీ
రాజా రావు, జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, "అజాది కా అమృత్ మహోత్సవ్" భాగంగా
దేవీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి, ప్రజల్లో అవగాహనా కల్పించడం జరుగు తోందన్నారు.
ఈ సైకిల్ ర్యాలీ లో సుమారు ఆర్ట్స్, ఎస్. కె. వి. టి. కాలేజ్ లకి చెందిన 300 మంది విద్యార్థులు పాల్గొ న్నారన్నారు. లక్కీడిప్ ద్వారా 10 మందికి 5 మంది బాలికల కు, 5 మంది బాలురకు సైకిల్స్ పంపిణీ చేశామన్నారు. గెయిల్ ఆధ్వర్యంలో అజాది కా అమృత్ మహోత్సవ్ ని పురస్కరించుకొని గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ నినాదం తో నిర్వహించిన సైకిల్ ర్యాలీ నీ నిర్వహించడంపై నిర్వాహకుల చొరవ ను ఆయన అభిందనీయమన్నారు. యువత దేశానికీ మార్గదర్శకంగా నిలిచే దిశలో ప్రజల్లో చైతన్య వంటమైన కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవ్వాలని కోరారు.
పెట్రోలియం మినిస్టరీ, పి. సి. ఆర్. ఐ, ఆదేశానుసారం గెయిల్ వారి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ మైదానం నుండి దేవిచౌక్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గెయిల్ చీఫ్ జెనరల్ మేనేజర్ కేవీఎస్ రావు, జి. యం.లు, బి.ఎన్. రావు, రాజారావు, అంకయ్య, సీనియర్ మేనేజర్ (CSR) బాలాజీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment