*రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి*
*కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టిన మంత్రి ధర్మాన ప్రసాద్ కి శుభాకాంక్షలు తెలిపిన ఛైర్మన్*
అమరావతి, ఏప్రిల్, 27 (ప్రజా అమరావతి): రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ ని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి కలిశారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన సముదాయంలో సీసీఎల్ఏ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ధర్మానకు ఛైర్మన్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాభినందనలు తెలిపారు. 1, 3వ అంతస్తులలో కేటాయించిన కొత్త కార్యాలయాన్ని బుధవారం మంత్రి ధర్మాన ప్రారంభించడం పట్ల ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాద్ మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులకు కావలసిన సకల వసతులతో సరికొత్తగా తీర్చిదిద్దిన సీసీఎల్ఏ కార్యాలయం నిర్మాణం పట్ల ఏపీఐఐసీ ఛైర్మన్ సహా ఉన్నతాధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
addComments
Post a Comment