మంత్రులను కలిసిన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి

 అమరావతి (ప్రజా అమరావతి);


*మంత్రులను కలిసిన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి* ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి  మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీలతో ఆయన సమావేశమయ్యారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సోమవారం మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీకి ఆయన శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయానికి విచ్చేసిన జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో ఛైర్మన్ భేటీ అయ్యారు. ఆయనకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీఐఐసీ భవనంలో కొలువుదీరిన ప్రభుత్వ శాఖల కార్యాలయాల సమాచారాన్ని మంత్రులకు ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వివరించారు. ఇద్దరు మంత్రులకు పుష్పగుచ్ఛాలు అందజేసి ఆయన అభినందించారు. Comments