ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరకు ఘన స్వాగతం
విజయనగరం, ఏప్రిల్ 13 (ప్రజా అమరావతి):
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పీడిక రాజన్నదొరకు జిల్లా కేంద్రంలో ఘనస్వాగతం లభించింది. ఈనెల 11న రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన గిరిజన సంక్షేమ మంత్రి రాజన్నదొరకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం ఉదయం 10.45 గంటలకు జెడ్పీ అతిథిగృహానికి చేరుకున్న రాజన్నదొరను జిల్లా యంత్రాంగం తరపున జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి పి.వి.సునీల్ రాజ్‌కుమార్, డి.ఎం.హెచ్.ఓ. డా.ఎస్.వి.రమణకుమారి, జిల్లా గృహనిర్మాణ అధికారి ఎస్.వి.రమణమూర్తి తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు.
జిల్లాకు చెందిన శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి చినప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు, ఎమ్మెల్సీ రఘురాజు, ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ తదితరులు జెడ్పీ అతిథిగృహంలో ఉప ముఖ్యమంత్రిని కలసి స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద జెడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రిని కలసి అభినందించారు. గిరిజన సంఘాల నాయకులు తుమ్మి అప్పలరాజు దొర, గిరిజన ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు కూడా ఉప ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.
addComments
Post a Comment