సర్వేపల్లి నియోజక వర్గంతోపాటు జిల్లా అభివృద్దికి తన వంతు కృషి చేస్తా

 :

నెల్లూరు, (ప్రజా అమరావతి);


          

సర్వేపల్లి  నియోజక వర్గంతోపాటు  జిల్లా అభివృద్దికి తన వంతు కృషి చేస్తా


నని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.     

          

రాష్ట్ర వ్యవసాయ,  సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా  జిల్లాకు విచ్చేసిన శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, సోమవారం సర్వేపల్లి నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటించారు. సర్వేపల్లి నియోజక వర్గ పర్యటనలో భాగంగా  తొలుత జాతీయ రహదారిలోని గొలగమూడి  సెంటర్కు చేరుకోగా,  వైసీపీ నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డికి  అపూర్వ స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.  అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక రధంలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గొలగమూడికి చేరుకొనగా, గొలగమూడి గ్రామంలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డికి వైకాపా నేతలు,  కార్యకర్తలు, అభిమానులు దారిపొడవునా పూల వర్షం కురిపిస్తూ ఘనంగా స్వాగతం పలికారు.  అనంతరం మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి,   భగవాన్  శ్రీ వెంకయ్య స్వామి వారిని ,  శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోగా,  దేవస్థానం అర్చకులు వేద ఆశీర్వచనం ఇచ్చి, స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందచేశారు.  ఈ సంధర్బంగా గొలగమూడి ఆశ్రమం ఈ.ఓ  శ్రీ పి. బాలసుబ్రమణ్యం శాలువతో మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డిని సత్కరించారు.


అనంతరం మంత్రి  కంటేపల్లికి చేరుకోగా, గ్రామస్తులు, కార్యకర్తలు  పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సంధర్భంగా మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి,  కంటేపల్లి సెంటర్లో వున్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి  పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి  మంత్రి కసుమూరుకు  చేరుకొగా,  మస్తాన్ వలీ దర్గా కమిటీ సభ్యులు  మంత్రికి దర్గాలో ఫాతిహా నిర్వహించారు.  


అనంతరం  మంత్రి స్వగ్రామమైన తోడేరు గ్రామానికి చేరుకొని మహంకాళమ్మ  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  శ్రీ కాకాణి రమణారెడ్డి గారి స్మారక ప్రాంగణంనకు చేరుకొని మంత్రి తండ్రి గారైన కీ.శే శ్రీ కాకాణి రమణా రెడ్డి గారి సమాధి వద్ద  పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి నివాసంనకు చేరుకొని గ్రామస్తులతో సహపంక్తి భోజనం చేశారు.  


ఈ సంధర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ,  ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమానైనా   భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి గారి ఆశీస్సులతో ప్రారంభించడం ఆనవాయితీగా  జరుగుచున్నదని,  స్వామి వారి ఆశీస్సులు, నియోజక వర్గ ప్రజల ఆశీస్సులతో ఈ రోజు రాష్ట్ర మంత్రిగా బాద్యతలు చేపడ్డం జరిగిందన్నారు.  నాపై నమ్మకంతో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయ  మంత్రిగా బాధ్యతలు అప్పగించడం జరిగిందని,  ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడివుంటానని, వారి సహకారంతో నియోజక వర్గం లోనూ, జిల్లాలోను పెండింగ్ లో వున్న సమస్యలను పరిష్కరించేదుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి అన్నారు.  ముఖ్యంగా  వ్యవసాయ శాఖా మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అమలు  చేస్తున్న కార్యక్రమాలు  ప్రతి రైతుకు అందేలా కృషి చేయడంతో పాటు రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

        

మంత్రి వెంట వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీ సుధాకర్ రావు, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీ తిరుపాల్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏ.డి. శ్రీమతి రామమ్మ,  వెంకటాచలం, పొదలకూరు మండల అధికారులు,  ప్రజాప్రతినిధులు, ప్రజలు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Comments