*ఇళ్ల నిర్మాణం వేగంగా చేపట్టాలి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి):
*నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణం ఊపందుకోవాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పెనుకొండ మండలంలోని గుట్టూరు గ్రామంవద్ద ఉన్న జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్ లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. జగనన్న హౌసింగ్ లేఔట్ లో 91 ఇల్లు మంజూరు చేయడం జరగగా, అందులో 86 ఇళ్లు నిర్మాణం మొదలుపెట్టగా, ఒకటి గ్రౌండింగ్ చేయాల్సి ఉందన్నారు. బిలో బేస్మెంట్ స్థాయిలో 36 ఉన్నాయని, వాటిని వెంటనే బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలన్నారు. అలాగే బేస్మెంట్ స్థాయిలో 41 ఇళ్లు ఉన్నాయని, ఆర్ఎల్ లో 8 ఉన్నాయని, వాటిని వేగవంతం చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణం త్వరితగతిన చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారి చంద్రమౌళిరెడ్డి, హౌసింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.*
addComments
Post a Comment