జిల్లా లో పలు పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన: జిల్లా కలెక్టర్

 


జిల్లా లో పలు పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన: జిల్లా కలెక్టర్ తిరుపతి, ఏప్రిల్ 29 (ప్రజా అమరావతి): తిరుపతి జిల్లాలోని వడమాలపేట, పుత్తూరు, నారాయణవనం మండలాలలోని పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి తనిఖీ చేశారు. శుక్రవారం ఉదయం నుండి వడమాలపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో జరుగుతున్న పదవ తరగతి పరీక్ష సెంటర్ ని ఆకస్మిక తనిఖీ చేసి వివరాలు తెలుసుకుని జిల్లా కలెక్టర్ ఇన్విజిలేటర్ లకు పలు సూచనలు చేసారు. పరీక్షా కేంద్ర ఆవరణంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులును ఎవరినీ అనుమతించరాదని చీఫ్ సుపరింటెండెంట్ ను ఆదేశించారు, త్రాగు నీరు ఏర్పాటు, ఎ ఎన్ ఎం ల అందుబాటు తదితర అంశాల పై ఆరా తీసి పలు సూచనలు చేశారు. 

అనంతరం పుత్తూరు మండలం, గొల్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి పోలీసులు పరీక్షా కేంద్రానికి దూరంగా ఉండడంతో మందలించి మెయిన్ గేట్ వద్ద ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితిలో సెల్ ఫోన్లు అనుమతించరాదని చీఫ్ సూపరింటండెంట్ కి సూచించారు.

నారాయణవనం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర మరియు బాలికల పాఠశాల పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. బాలుర కేంద్రంలో 190 మంది పరీక్షకు ఈ రోజు హజరయ్యారని, నాడు - నేడు కింద బల్లలు, బోర్డ్ ఇతరములు ఏర్పాటయ్యాయని చీఫ్ సూపరింటెడెంట్ వివరిచారు. పరీక్షా కేంద్రంలో మెడికల్ సిబ్బంది మందులు, ORS  ఏర్పాటు, త్రాగు నీరు ఇతర ఏర్పాట్లు పరిశీలించారు. పరీక్షా కేంద్రం వద్ద విధుల్లో ఉన్న పోలీస్ లు, సిబ్బందికి పరీక్షలు  పకడ్బందీగా నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ పర్యటన లో జిల్లా విద్యా శాఖాధికారి శేఖర్, సంబంధిత ప్రాంతాల మండల ఎంపిడిఓ లు, తసిల్దార్లు ఉన్నారు...Comments