అనపర్తి (ప్రజా అమరావతి) ;
ప్రజలకు పారదర్శకంగా పౌర సేవలు అందించాలి
అర్హులను గుర్తించడం లో నిబద్దత ఉండాల
సచివాలయ ఉద్యోగులు డ్రెస్ కోడ్ తప్పనిసరి గా పాటించాలి
జేసీ శ్రీధర్
గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థలో పాల్గొనే సిబ్బంది తప్పని సరిగా డ్రెస్ కోడ్ పాటించాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు.
శనివారం నల్లజర్ల మండలంలో సచివాలయం, అర్భికే లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చెయ్యడం ద్వారా ప్రభుత్వం పారదర్శకతతో కూడిన సేవలు ప్రజలకు అందుబాటులో తీసుకుని రావడం జరిగిందన్నారు. ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ సేవలు అందించే క్రమంలో గ్రామ స్థాయిలో సచివాలయ, ఆర్భికే లను ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. పౌర సేవలు అందించే క్రమంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సచివాలయం లోని వివిధ రీజిస్టర్లను పరిశీలించారు.
అనంతరం ఆర్భికే ను సందర్శించి, ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియపై వివరాలు తెలుసుకున్న జేసీ, రైతులకు తగిన సూచనలు చెయ్యాలని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. రైతులకు సరైన తూకం వేసి, సరైన ధర అందించేందుకు సిబ్బంది నిబద్దతతో పనిచేయాలన్నారు. రైతు వివరాలు, బ్యాంకు ఖాతా సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డేటా ఎంట్రీ సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
నల్లజర్ల 1 అర్భికే ను, పుల్లపాడు, అనంతపల్లి 2 సచివాలయాలు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జేసీ వెంట మండల స్థాయి అధికారులు తహశీల్దార్, సచివాలయ, అర్భికే సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment