*హోంశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష.*
*హోంశాఖపై సీఎం రివ్యూ – కీలక ఆదేశాలు*
*ఏసీబీ, దిశ, ఎస్‌ఈబీలు కార్యకలాపాలు సహా సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు చెక్*
*వీటికి అత్యంత ప్రాధాన్యత*
*అవినీతి చోటుచేసుకుంటున్న విభాగాలను క్లీన్ చేయాల్సిందే*
*దిశ తరహాలో అవినీతిపై ఫిర్యాదులకు ఏసీబీకి యాప్
*
*నెలరోజుల్లోగా యాప్ రూపకల్పన*
*నేర నిర్ధారణకు ఫోరెన్సిక్ విభాగం బలోపేతం*
*మండల స్థాయి వరకూ ఏసీబీ స్టేషన్లు*
*ఇతర విభాగాల్లో అవినీతి ఫిర్యాదులపైనా ఏసీబీ పర్యవేక్షణ*
*డ్రగ్స్ వ్యవహారాలకు రాష్ట్రంలో చోటు ఉండరాదు*
*మూలాల్లోకి వెళ్లి కూకటి వేళ్లతో పెకలించేయండి*
*విద్యాసంస్థలపై ప్రత్యేక నిఘా*
*చీకటి ప్రపంచంలో వ్యవహారాలను సమూలంగా నిర్మూలించండి*
*ప్రతినెలా ఈ అంశాల్లో ప్రగతిని నివేదించాలి*
*ఎస్‌ఈబీకి ప్రత్యేక కాల్ సెంటర్ నంబర్*
*హోంశాఖపై సమీక్షా సమావేశంలో అధికారులకు సీఎం శ్రీ వైయస్.జగన్ ఆదేశాలు*
అమరావతి (ప్రజా అమరావతి);
*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:*
– అవినీతి నిరోధం, సమర్థవంతంగా ‘దిశ’ అమలు, ఎస్‌ఈబీ కార్యకలాపాలసహా సోషల్ మీడియాధ్వారా వేధింపులను అడ్డుకోవడంపై అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి:
– ప్రతి హోంమంత్రి, డీజీపీ కూడా తమ విధినిర్వహణలో తమదైన ముద్ర ఉండాలి, ఇది వారికి గర్వకారణంగా నిలుస్తుంది:
– నిర్దేశించుకున్న లక్ష్యాలవైపు ఏకాగ్రతతో ముందుకుసాగాలి.
*అవినీతి నిరోధకశాఖ*
– అవినీతి నిరోధానికి ఏసీబీలో 14400 నంబర్ పెట్టాం.
– ఈ నంబర్‌ను మరింత విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలి.
– ఏసీబీ విధులేంటి, ఎలా పనిచేస్తుందన్నది విస్తృతంగా తెలియాలి.
– అవినీతికి ఎక్కడా కూడా ఆస్కారం ఉండకూడదు. ఎక్కడా కూడా అవినీతి అన్నది కనిపించకూడదు. ఏసీబీకి ఇది ప్రాధమిక విధికావాలి.
– ఆడియో, వీడియో రికార్డింగ్ సాక్ష్యాలున్నా వాటిని ఏసీబీ నెంబరుకు చేరవేసే ఏర్పాటు ఉండాలి.
–అందుకు తగినట్టుగా నెంబరు ఏర్పాటుచేసి, దాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి.
–అవినీతి కేసులు ఎక్కువగా నమోదవుతున్న విభాగాల్లో మరింత దృష్టిపెట్టాలి.
– గ్రామ, వార్డు సచివాలయాలు అవినీతికి దూరంగా ఉన్నాయి. భవిష్యత్తులోకూడా ఈ వ్యవస్థలో అవినీతి వ్యవహారాలు కనిపించకూడదు.
–దీనికోసం అవసరమైన ఎస్‌ఓపీలు తయారు చేయాలి.
– గ్రామ, వార్డు సచివాలయాల్లోకి సబ్ రిజిస్ట్రార్ వ్యవస్థలు వస్తున్నాయి. సర్వేయర్లు వస్తున్నారు.
– భూముల పంపకాలవల్ల వచ్చే డివిజన్, సర్వే, రిజిస్ట్రేషన్ తదితర ప్రక్రియలన్నీ సచివాలయాల్లోనే జరుగుతాయి
– అలాంటి సందర్భాల్లో కూడా అవినీతికి ఆస్కారం ఉండకూడదు.
– అవినీతి చోటుచేసుకుంటున్న వ్యవస్థలను క్లీన్ చేసుకుంటూ వెళ్లాలి.
– ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గోరుముద్ద, సంపూర్ణ పోషణ వంటి కార్యక్రమాల్లో అవినీతికి, లంచాలకు తావు ఉండకూడదు.
– అవినీతి జరుగుతున్నట్టుగా ఆడియో రికార్డ్ ఉన్నా, దాన్ని పంపించినా సరే.. చర్యలు తీసుకునేట్టుగా వ్యవస్థ ఉండాలి.
– రూ.1.35 లక్షల కోట్లు మూడేళ్ల కాకముందే డీబీటీ పద్ధతుల్లో ప్రజలకు ఇచ్చాం:
–ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎక్కడా కూడా పైసా అవినీతి, వివక్షకు తావు లేకుండా ప్రజల ఖాతాలకు పంపాం:
– వచ్చే రెండేళ్లతో కలిపితే సుమారు రూ.2.5లక్షల కోట్లు ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందిస్తున్నాం:
– దేవుడి దయవల్ల ఎలాంటి అవినీతికి చోటు లేకుండా ఇవన్నీ చేస్తున్నాం:
– మండలస్థాయి వరకూ కూడా ఏసీబీని బలోపేతం చేయాలి:
– అవినీతి నిరోధం, దిశ, ఎస్‌ఈబీ.. ఈమూడు అంశాలకు సంబంధించి మండలస్థాయిల్లో స్టేషన్లు ఉండాలి, ఈ మూడు అంశాలను పర్యవేక్షించడానికి ప్రతి జిల్లా స్థాయిలో ఒక అధికారి ఉండాలి:
– దిశమాదిరిగా అవినీతి నిరోధానికి ఒక యాప్‌ను పెట్టాలి:
– నెలరోజుల్లోగా యాప్‌ను తయారుచేయాలి, కార్యాచరణకూడా సిద్ధంచేయాలి:
– దీనిద్వారా ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు, తమ వద్దనున్న ఆడియో, వీడియో సహా పత్రాలను నేరుగా అప్‌లోడ్ చేయొచ్చు:
– వీటిని నిర్ధారించడానికి అధునాతన ఫోరెన్సిక్ వ్యవస్థలు కూడా ఉండాలి:
– లంచాల కేసుల్లో అరెస్టయిన వారికి వేగంగా శిక్షలు కూడా పడాలి:
– ప్రస్తుతం ఉన్న చట్టాలను కూడా పరిశీలించి, మార్పులు, చేర్పులు ఉంటే చేసి సమర్థవంతంగా అమలు చేయాలి:
– ఏ అవినీతి వ్యవహారంపైనైనా ఏసీబీ పర్యవేక్షణ చేపట్టాలి:
– ప్రభుత్వ పథకాల్లో అవినీతిపైన వచ్చిన ఫిర్యాదులపైనా ఏసీబీ దృష్టిపెట్టాలి:
– సంబంధిత శాఖలు ఆ ఫిర్యాదులపై తీసుకుంటున్న చర్యలను ఏసీబీ పర్యవేక్షించాలి:
– దీనికోసం వివిధ ప్రభుత్వ విభాగాలు, ఏసీబీ మధ్య సినర్జీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి:
– ఏసీబీకి ఫిర్యాదు చేయాల్సిన నంబర్‌ను ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా బాగా కనిపించేలా హోర్డింగ్స్ పెట్టాలి:
– యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు చేయొచ్చు.. అన్నదానిపై తగిన సూచనలు కూడా ఈ హోర్డింగ్‌లో ఉండాలి:
*దిశ*
– ఇది మునుపెన్నడూ జరగనటువంటి కార్యక్రమం:
– హోంమంత్రి, డీజీపీ దిశ అమలును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి:
– ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిన ప్రతి బాలిక, మహిళ చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. భద్రతకు భరోసా లభించినట్లే:
– ఎస్‌ఓఎస్ బటన్ నొక్కినా ఫోన్‌ను 5 సార్లు అటూ, ఇటూ ఊపితే చాలు 10–15 నిమిషాల్లో పోలీసులు ఉంటారు:
– ఈ రెస్పాన్స్ టైంను ఇంకా తగ్గించడంతో పాటు కచ్చితంగా వారికి సహాయం అందాలి:
– ఎంత వేగంగా ఘటనా స్ధలానికి చేరగలిగితే అంతే వేగంగా నేరాన్ని నివారించగలుగుతాం:
– దీనివల్ల మహిళలు, బాధితులకు భద్రతకల్పించే విషయంలో గొప్ప మార్పు వస్తుంది:
– దిశను మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి మరింత మెరుగైన ప్రోటోకాల్స్ రూపొందించాలి:
– ప్రభుత్వం తరపు నుంచి ఇంకా ఏం కావాలన్నా చేయడానికి సిద్ధం:
– ఇంతవరకు 1.24 కోట్ల దిశ యాప్ డౌన్లోడ్స్ అయ్యాయి:
– మన లక్ష్యం.. నేరాన్ని నివారించడమే కాదు, ఆ క్రైమ్ చేసిన వ్యక్తికి శిక్ష విధించడం
– ఈ మొత్తం ప్రక్రియలో వ్యవస్ధ అత్యంత సమర్ధవంతంగా పనిచేయాలి.
– ఇప్పుడు ఏర్పాటుచేసుకున్న వ్యవస్థలను బలోపేతం చేసేదిశగా చేసే ఎలాంటి ప్రతిపాదనలను అయినా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది:
*స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ)*
– మద్యం అక్రమ రవాణా, అక్రమ మద్యం తయారీని ఉక్కుపాదంతో అణిచివేయాలి:
– ఎస్‌ఈబీకి నిర్దేశించిన కార్యకలాపాలు కూడా అత్యంత కీలకం:
– ఎస్‌ఈబీకోసం కూడా ఒక కాల్‌సెంటర్ నంబర్‌ను పెట్టాలి:
– మద్యం అక్రమరవాణా, అక్రమ మద్యం తయారీలను ఉక్కుపాదంతో అణచివేయాలి:
– ఆధునిక నాగరికత పేరుతో వస్తున్న పెడధోరణులకు అడ్డుకట్టవేయాలి:
– డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిరోధించాలి:
– విద్యాసంస్థలమీద పూర్తిగా నిఘా పెట్టాలి:
జూనియర్ కళాశాలలు మొదలుకుని, ఇంజనీరింగ్, డిగ్రీ, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు మీద ఫోకస్ పెట్టాలి:
– మన పిల్లలు వీటి బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది:
– ఎక్కడ ఏం జరిగినా... మనకు వెంటనే సమాచారం వచ్చేలా అందుకు తగ్గ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి:
–కాలేజీ స్ధాయి వరకు ఇన్‌ఫార్మర్ వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవాలి – ఏ సమాచారం వచ్చినా సరే... వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి:
– కేవలం డ్రగ్స్‌ను విక్రయిస్తున్న వారిపైనే కాకుండా... మూలాల్లోకి పోయి... ఆ వ్యవస్థలను కూకటి వేళ్లతో పెకలించాల్సిన అవసరం ఉంది:
– చీకటి సామ్రాజ్యాలలో జరిగే ఇలాంటి కార్యకలాపాలపై కూడా పోలీసులు దృష్టిపెట్టాలి, నిఘా పెంచాలి:
– టయర్ వన్ సీటీలలో డ్రగ్స్ లాంటి ఘటనలు చూశాం. అలాంటివి ఇక్కడకూడా జరుగుతున్నాయా? అన్నది దృష్టి పెట్టాలి:
– మన పిల్లల్ని, మన విద్యావ్యవస్థలను మనం కాపాడుకోవాలి:
– అలాంటి కార్యక్రమం మనం చేయకపోతే భవిష్యత్ తరం ఫెయిలవుతుంది :
– వారికి మంచి భవిష్యత్తును అందించే వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనది:
– ఒకరి జీవితాలను, కొన్నికుటుంబాలను నాశనంచేసే పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా ఉండకూడదు:
– అత్యంత సమర్థవంతంగా పోలీసులు వ్యవహరించాలి:
– సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు పాల్పడుతున్న వారిపైకూడా కఠిన చర్యలు తీసుకోవాలి:
– నేను పేర్కొన్న అంశాల్లో ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటో మదింపు చేయండి:
– ప్రతినెలా నాతో జరిగే సమావేశంలో మళ్లీ ఏ స్థాయిలో మెరుగుపడ్డామో బేరీజు వేసి నివేదిక ఇవ్వండి:
– ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలను పరిశీలించి సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేయండి:
– గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న మహిళా పోలీసుకు కూడా దిశ, ఎస్‌ఈబీ, ఏసీబీ ఈ మూడింటి కార్యకలాపాలపైనా అవగాహన కల్పించాలి : సీఎం
– యాప్స్ వినియోగంపై అవగాహన కల్పించాలన్న సీఎం:
– దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారికి సలహాలు, సూచనలను నోటిఫికేషన్స్ రూపంలో పంపించాలని సీఎం సూచన:
– దీనివల్ల ఘటన జరగ్గానే యాప్‌ను చురుగ్గా వాడుకునేలా సిద్ధంగా ఉంటారన్న సీఎం:
– నేరనిర్ధాణకు అత్యంత కీలకమైన ఫోరెన్సిక్ వ్యవస్థలను బలోపేతం చేయాలన్న సీఎం
– అవసరమైన వాటిని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది : అధికారులకు స్పష్టం చేసిన సీఎం.
ఈ సమీక్షా సమావేసంలో హోంశాఖమంత్రి తానేటి వనిత, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ కె వి రాజేంద్రనాథ్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment