నవ సమాజానికి ఆదర్శనీయం వాలంటీర్ వ్యవస్థ



*రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థకు సెల్యూట్.....


* గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య వ్యవస్థను నిర్మించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.


* నవ సమాజానికి ఆదర్శనీయం వాలంటీర్ వ్యవస్థ


.


::: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బిఐ అంజాద్బాష::


కడప - ఏప్రిల్,22 (ప్రజా అమరావతి):- ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ సక్రమంగా చేరుస్తున్న గ్రామ వార్డు వాలంటీర్ల సేవలు అభినందనీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్బాష అన్నారు. శుక్రవారం స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ నందు 32/1, 32/2, 33/1, 33/2, 34/1, 34/2, 35/1, 35/2,  36/1,36/2,  37/1, 37/2 వార్డు లకు సంబంధించి సచివాలయ వార్డు వాలంటీర్లు సేవా పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్బాష, నగర మేయర్ కే సురేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్బాష మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వాటిని ప్రజలకు చేరువ చేసేందుకు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన వారందరికీ సక్రమంగా  చేరుస్తున్న గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల సేవలు అభినందనీయమని అన్నారు. వారిని సత్కరిస్తున్న ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్షత లేకుండా పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూన్న చిన్న వాలంటీర్ల పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. ఎక్కడ అవినీతి జరగకుండా గ్రామ వార్డు వాలంటీర్ ల ద్వారా అర్హులైన లబ్ధిదారుల కే సంక్షేమ పథకాలను అందించడం జరిగిందన్నారు.  సంక్షేమ పథకాల లబ్ధిని ప్రజలకు అందజేయడంలో అర్హతే ప్రధాన ప్రామాణికాలు గా ముందుకెళ్లాలని, నిబద్ధతతో, పారదర్శకంగా సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు ఎంపిక చేసి ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచాలని సచివాలయ సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి సూచించారు.


నగర మేయర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని వాటిని సచివాలయ గ్రామ వార్డు వాలంటీర్ ల ద్వారా అందజేయడం జరుగుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రం లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లోనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి అభివృద్ధి జరగలేదని ప్రజలను మోసగించడం జరిగిందని అన్నారు.


కడప నగర పరిధిలో ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఏడాది పాటు సేవలందించిన వాలంటీర్లకు పురస్కారాలతో సత్కరించడం జరిగింది. అందులో భాగంగా 32/1, 32/2, 33/1, 33/2, 34/1, 34/2, 35/1, 35/2,  36/1,36/2,  37/1, 37/2 వార్డు లకు సంబంధించి 146 మందికి సేవా మిత్ర పురస్కారాలకు ఎంపిక చేసి పలువురికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజాద్బాష, నగర మేయర్ కే సురేష్ బాబు చేతుల మీదుగా ప్రధానం చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, కార్పోరేటర్లు జఫ్రుల్లాహ్, చాక్లెట్ గౌస్, అక్బర్, షంషేర్, రఫీ, బసవరాజు, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Comments