రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్ట్ లన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తాము

 

విజయవాడ (ప్రజా అమరావతి);

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్ట్ లన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తామని


, ప్రతి రైతుకూ సాగు నీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నారు.

గురువారం జలవనరుల శాఖా మంత్రిగా పదవీ స్వీకరించిన అనంతరం విజయవాడ ఇరిగేషన్ క్యాంప్  ఆఫీస్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అతి కీలకమైన జలవనరుల శాఖను అప్పగించారని ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని ఈ శాఖను మరింత సమర్థవంతంగా ముందుకు నడిపిస్తానని మంత్రి అన్నారు.  రాష్ట్రంలో వై. ఎస్. రాజశేఖర రెడ్డి జలయజ్ఞం చేపట్టి అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో అనేక ప్రాజెక్ట్ లను ప్రారంభించారని వాటిలో కొన్ని పూర్తి అయ్యాయని, కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్ లుగా ఉన్నాయని, దశల వారీగా పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేసి ప్రతి ఎకరాకు  సాగు నీరు అందేలా అదనపు సాగు విస్తీర్ణం పెరిగేలా రాష్ట్ర  ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. 

పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాల వల్లే డయాఫ్రేమ్ వాల్ దెబ్బ తిందని మంత్రి అన్నారు.  డయాఫ్రేమ్ వాల్ ఏ మేరకు నష్ట పోయిందో అధికారులు అంచనా వేయడంలో తలమునకలు అయి ఉన్నారన్నారు.  పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించి మేధో మధనం జరుగుతుందని ఢిల్లీ, చెన్నై ఐఐటి నుండి నిపుణులు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించారన్నారు.  అంతేకాక   దేశంలోని సాగునీటి ప్రాజెక్ట్ ల నిర్మాణంలో  నిష్ణాతులైన వారు కూడా ప్రాజెక్ట్ ను సందర్శించి తగు సూచనలు ఇవ్వనున్నారని అయన అన్నారు.   2019 వరదల్లో డయా ఫ్రేమ్ వాల్ దెబ్బ తిందని భారతదేశ చరిత్రలో ఎక్కడా డయాఫ్రేమ్ వాల్ దెబ్బతినడం జరగలేదని మంత్రి అన్నారు.  నాగార్జున సాగర్, శ్రీశైలం, భాక్రానంగల్ మొదలగు అన్ని ప్రాజెక్ట్ లకు డయాఫ్రేమ్ వాల్ నిర్మించారని  మంత్రి అన్నారు.  దేశంలో ఎక్కడ జరగ కుండా పోలవరం ప్రాజెక్ట్ కు సంబందించిన డయాఫ్రేమ్ వాల్ ఎందుకు దెబ్బతిందని మంత్రి ప్రశ్నించారు.  గత ప్రభుత్వం చేసిన తప్పిదమని, ఆనాటి  ముఖ్యమంత్రి,  ఆనాటి ఇరిగేషన్ శాఖా మంత్రి  చేసిన పాపమని మంత్రి అన్నారు.  రూ. 430 కోట్లు గంగలో పోశారని డయాఫ్రేమ్ వాల్ ఎంత మేర దెబ్బ తిన్నదనేది నిపుణులు పరిశీలిస్తున్నారని మంత్రి అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలెనే రీ డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు.  అసలు రైతుల ఆత్మ హత్యలకు కారణం గత ప్రభుత్వమేనని, రూ. 94 వేలకోట్లు గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ. 15 వేలకోట్లు మాత్రమే రుణమాఫీ చేసి రైతులను మోసం చేసిందన్నారు.  


Comments