ఉద్యోగ కల్పనయే ప్రభుత్వ ధ్యేయం



*  ఉద్యోగ కల్పనయే ప్రభుత్వ ధ్యేయం



::: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బి ఎస్. బి. అంజాద్ బాషా :::


కడప, ఏప్రిల్, 29 (ప్రజా అమరావతి):-  రాష్ట్రంలో నిరుద్యోగతను పారద్రోలి  యువతకు ఉద్యోగాలు కల్పించడమే  రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్. బి. అంజాద్ బాషా అన్నారు. 


శుక్రవారం స్థానికంగా ఉన్న తన క్యాంపు కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 8 మందికి బ్యాక్ లాగ్ పోస్టుల నియామకపు ఉత్తర్వులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.బి అంజాద్ భాష చేతుల మీదగా అందించారు.    ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న ఉదేశ్యం తో ఇప్పటికే ఏ.పి.పి.ఎస్.సి. ద్వారా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి భర్తీ చేయడం జరుగుతోందన్నారు. అంతే గాక కారుణ్య నియమకాలతోపాటు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో బ్యాక్ లాగ్ వేకన్సీ పోస్టులను భర్తీ చేయడం జరుగుతోందన్నారు. ప్రస్తుతం ఈ క్రమంలో 2020 సంవత్సరానికి సంభందించి  నాన్ డి.ఎస్. సి. పరిధిలోని అంధుల క్యాటగిరిలో అటెండర్, స్వీపేర్, పి.హెచ్. వర్కర్, మరియు ట్రాక్టర్ వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. 


 రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ వేకెన్సీలు ఉన్నాయో విభిన్న ప్రతిభావంతుల కోటా కింద బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతోందని అన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కడప జిల్లాకు చెందిన 8 మందికి బ్యాక్ లాగ్ పోస్ట్ కింద ఉద్యోగ అవకాశం కల్పించి నియామకపు ఉత్తర్వులను తన చేతుల మీదుగా అందించడం జరిగిందని అన్నారు.  

ఉత్తర్వులను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. నియామకపు ఉత్తర్వులు అందుకున్న వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.


1) అట్లూరు మండలం, ఎస్. వి పురం, కుంభ గిరి ప్రాంతానికి చెందిన ఇ. నాగరత్నకు విజువల్ హ్యాండీక్యాప్డ్ కోట  క్రింద వాటర్ కం వాచ్ మెన్ పోస్టుకు జిల్లా కోఆర్డినేటర్, హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయం కడప కు నియమించడం జరిగింది.


2) చాపాడు మండలం, చిన్నగురువాలూరు గ్రామానికి చెందిన నాగులరాపు పుష్పలత కు విజువల్ హ్యాండ్క్యాప్డ్  కోటా కింద పి. హెచ్. వర్కర్ పోస్టుకు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి నియమించడం అయినది.


3) రామాపురం మండలం, బండపల్లి గ్రామంకు మోటుకు సుప్రజ కు విజువల్ హ్యాండీక్యాప్డ్ కోట క్రింద టెక్నికల్ సబార్డినేట్ పోస్టుకు వీటి ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, కడప కార్యాలయమునకు నియమించడం జరిగింది.


4) చక్రాయపేట మండలం, కోట్లగంటివారిపల్లి గ్రామానికి చెందిన వి. శారద కు విజువల్ హ్యాండీక్యాప్డ్ కోట కింద స్వీపర్ గా జిల్లా విద్యాశాఖ, కడప కార్యాలయం నకు నియమించడం జరిగింది.


5) వీరపునాయునిపల్లి మండలం, గోనుమాకులపల్లి గ్రామానికి చెందిన నుకనబోయన గంగాదేవికి విజువల్ హ్యాండీక్యాప్డ్ కోట క్రింద ట్రాక్టర్ వర్కర్ పోస్టుకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయానికి నియమించడం జరిగింది.


6) కడప నగరం, మారుతి నగర్ కు చెందిన వల్లూరు నాగమణికి విజువల్ హ్యాండీక్యాప్డ్ కోట క్రింద డ్రైన్ క్లీనర్ పోస్టుకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయానికి నియమించడం జరిగింది.


7) వీరపునాయుని పల్లి మండలం, పాయసం పల్లి గ్రామానికి చెందిన నీస్ శ్రీనివాసులు కు ఓ. హెచ్. కోటా కింద రోడ్ గ్యాంగ్ లేబర్ పోస్టుకు ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయానికి నియమించడం జరిగింది.


8) పుల్లంపేట మండలం, పుత్తనవారి పల్లి గ్రామానికి చెందిన వర్ది బలరామయ్య కు ఓ.హెహ్. కోటా కింద పి.హెచ్. వర్కర్ పోస్టుకు బద్వేలు మున్సిపల్ కార్యాలయానికి నియమించడం జరిగింది.

 

ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు డి.వాణి, సిబ్బంది, విభిన్న ప్రతిభావంతులు తదితరులు పాల్గొన్నారు.


Comments