సహకార స్ఫూర్తిని మరింత ప్రోత్సహించాలి

 సహకార స్ఫూర్తిని మరింత ప్రోత్సహించాలి*


*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*


పెనుకొండ (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 27 (ప్రజా అమరావతి):


*సహకార స్ఫూర్తిని మరింత ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ మండలంలోని గుట్టూరు గ్రామం వద్ద మల్కాజి పల్లి తాండా రోడ్డులోని 44వ జాతీయ రహదారిపైనున్న రైతు సహకార వేరుశెనగ మిల్లును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.*


*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమాఖ్య సహకార స్ఫూర్తితో పనిచేస్తూ 2007 నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టి 2010 వ సంవత్సరం నుంచి మిల్లులో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఫార్మ్ వేదా అనే బ్రాండ్ ని ప్రమోట్ చేసుకొని ఫార్మ్ వేదా ద్వారా ఫ్లిపి కార్ట్, రిలయన్స్ ల ద్వారా పెద్దఎత్తున మార్కెటింగ్ చేస్తున్నారన్నారు. శ్రీ సత్యసాయి కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తరువాత స్థానికంగా అంగన్వాడిల్లో చేసే పౌష్టికాహారాల్లో రైతు సహకార వేరుశెనగ మిల్లు సహాయ సహకారాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇలాంటి సహకార స్ఫూర్తి ఇంకా భారీ ఎత్తున జరిగే విధంగా మనం ప్రోత్సాహం చేయడం ఎంతో ముఖ్యమని, రైతులందరూ సమాఖ్య స్ఫూర్తితో సహకార సంఘాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంఘాల ద్వారా మధ్యవర్తులు, దళారులు పూర్తిగా లేకుండా ఉంటారని, జిల్లాలో స్ఫూర్తిని తిరిగి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేయగలిగితే రైతులకు లాభదాయకంగా ఉంటుందని, మన పిల్లలకు కూడా ఇక్కడ తయారుచేసిన ఉత్పత్తుల ద్వారా పౌష్టికాహారం పరంగా కూడా లబ్ధి కలుగుతుందన్నారు. ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించవలసిందిగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వాటిని ఆదేశించడం జరిగిందన్నారు. ఈ సహకార స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుని వెళ్లి ప్రపంచ, దేశవ్యాప్తంగా ప్రోత్సహించేలా ప్రయత్నాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మహిళా రైతులతో మాట్లాడారు. ఈ మిల్లులో ఎంత దూరం నుంచి వచ్చి పనిచేస్తున్నారు, రోజూ ఇక్కడ పని దొరుకుతుందా, తదితర వివరాలను ఆరా తీశారు. మిల్లులో వేరుశనగ ఉత్పత్తులను పరిశీలించారు.* ఈ కార్యక్రమంలో పెనుగొండ సబ్ కలెక్టర్  నవీన్, ప్రొఫెసర్  శ్రీ  త్రిలోచన శాస్త్రి, సమాఖ్య అధ్యక్షులు j.v రమణ  రెడ్డి, వ్యవసాయ శాఖ జెడ్   శివ నారాయణ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.