పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా*..



*పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా*..


.


*రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష*...


*ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ 7.80 లక్షల చెక్కులు పంపిణీ*


కడప, ఏప్రిల్ 28 (ప్రజా అమరావతి):   ప్రతి పేదవాడి ఆరోగ్యానికి  రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్. బి అంజాద్ బాషా అన్నారు.


గురువారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష తన క్యాంపు కార్యాలయంలో 10 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి  కింద మంజూరైన రూ.7.80 లక్షల చెక్కులను  అందజేశారు.

 

ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష మాట్లాడుతూ.... పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి  రాష్ట్రం ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు సహకరించక పోయినా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పేద వాడిని ఆదుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించని జబ్బులకు ముఖ్యమంత్రి సహాయ నిధి  కింద  పేదప్రజలకు ఆర్థిక సహాయం అందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. 


దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి  ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ని గత పాలకుల నిర్లక్ష్యం చేసారని ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి  ఆరోగ్యశ్రీకి పెద్దపీట వేస్తూ దాదాపుగా 2600 పైగా సేవలను, ఆరోగ్యశ్రీ పథకం కిందకి చేర్చారన్నారు. ఇంకా ఆరోగ్యశ్రీ పథకం వర్తించని  జబ్బులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద నిధులను అందజేయడం జరుగుతుందన్నారు.  .ప్రభుత్వం గ్రీన్ ఛానెల్ ద్వారా ప్రతి నెల హాస్పిటల్స్ కు బిల్లులు చెల్లిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలని ప్రజలు ఆశీస్సులు అందించాలని ఆకాంక్షించారు .


ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు,వైఎస్సార్సీపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.  


Comments