నెల్లూరు, (ప్రజా అమరావతి);
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులకు అవసరమైన అన్నీ సేవలు గ్రామ స్థాయిలోనే రైతులకు అందాలన్న సంకల్పంతో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి వాటి ద్వారా రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు ఆ పంటల అబివృద్దికి అవసరమైన సలహాలు సూచనలు అందిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సంగం బ్యారేజి పర్యటన అనంతరం విరువూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, సర్వేపల్లి నియోజక వర్గ ప్రజల ఆశీస్సులతో ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా పదవి చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాంత రైతాంగ అవసరాలను గుర్తించి ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు, సంగం బ్యారేజి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. మరో మూడు మాసాల్లోనే ఈ బ్యారేజి నిర్మాణాన్ని పూర్తి చేసి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని పంట సాగు పెట్టుబడి కి రైతు భరోసా క్రింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇవ్వడం తో పాటు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాల
ను ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు అందించడంతో పాటు రైతులకు అవసరమైన అన్నీ సేవలు అందిస్తున్నట్లు మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతులు సొసైటీ లకు వెళ్లకుండా సొసైటిలను రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. సచివాలయ వ్యవస్థ తో పాటు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి నెలా అర్హులైన పేద ప్రజలకు ప్రతి నెలా ఒకటవ తేదీన నేరుగా వారింటికే అందచేయడం జరుగుచున్నదని మంత్రి వివరించారు. రబీ సీజన్లో రైతులకు అవసరమైన సాగు నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందని, ఇంకా ఎక్కడైనా ధాన్యం మిగిలిపోతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. సబ్సిడీ కింద 3500 ట్రాక్టర్స్ రైతులకు ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సిద్దం చేస్తున్నారని, సర్వేపల్లి నియోజక వర్గంలో అర్హులైన రైతులండరు ధరకాస్తు చేసుకోవాలని మంత్రి ఈ సంధర్భంగా సూచించారు.ఈ గ్రామంలోని పాఠశాలకు సంబందించి అవసరమైన అదనపు తరగతి గదుల మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుగంగ సి.ఈ శ్రీ హరినారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి శ్రీ సుదాకర్ రాజు, పొదలకూరు జడ్పిటిసి శ్రీమతి నిర్మలమ్మ, పొదలకూరు తహసీల్దార్ శ్రీ సుధీర్, ఎం.పి.డి.ఓ శ్రీమతి సుశీల, వివిధ శాఖల మండల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment