మలేరియా రహిత జిల్లాగా చేయాలి
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
విజయనగరం, ఏప్రిల్ 25 (ప్రజా అమరావతి): ఎక్కడా దోమలు ఉండే అవకాశం లేకుండా చూడాలని, తద్వారా జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ సూర్య కుమారి తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్బంగా
సోమవారం కలెక్టరేట్ నందు మలేరియా నిర్మూలన పై జిల్లా మలేరియా శాఖ ఆధ్వర్యంలో అవగాహ కలిగించడం కోసం ముద్రించిన పోస్టర్స్,, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో, ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. నిలువ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా లార్వి సైడ్ మందులు స్ప్రే చేయాలన్నారు. ఇండ్లలో కూడా దోమల మందులను స్ప్రే చేయాలన్నారు. డ్రై డే లను పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు.
👉వేసవి గాలుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి::
రానున్న మూడు రోజులు వడగాల్పులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ నుండి హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. మజ్జిగ, ఓ.ఆర్.ఎస్, తాగు నీటిని వెంట పెట్టుకోవాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకూడదని అన్నారు. ఎండలో కి వెళ్లవలసి వస్తే టోపి లేదా గొడుగు ధరించాలన్నారు. పరీక్షా కేంద్రాల్లోనూ ప్రతి గది వద్ద తాగు నీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారుల కూడా విధి నిర్వహణ లో వేశవికి తగ్గట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి తులసి పాల్గొన్నారు.
addComments
Post a Comment