రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి);
రాజమహేంధ్రవరాన్ని కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుదాం...
ప్రతి ఒక్కరూ నగర సుందరీ కరణకు సహకరించాలి..
కలక్టరు.. డా. కే. మాధవీలత
నూతన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన "రాజమహేంద్రవరాన్ని" స్వచ్చనగరంగా తీర్చి దిద్దేందికు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టరు డా. కె. మాధవీలత అన్నారు.
శనివారం ఉదయం స్థానిక వై. జంక్షన్ వద్ద ఎన్జీఓలు, నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వై జంక్షన్ నుంచి లాలాచెరువు వరకు చేపట్టిన స్వచ్చ సంకల్పం, శ్రమ దానం కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె. మాధవీలత, నగరపాలక సంస్థ కమీషనరు కె. దినేష్ కుమార్ ఎన్జీవోలు, స్వచ్చంద సంస్థలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టరు డా.మాధవీలత మాట్లాడుతూ , నూతనంగా ఏర్పడిన జిల్లాలో ప్రధాన కేంద్రమైన రాజమహేంద్రవరం నగరానికి సాంస్కృతిక నగరంగా మంచి పేరు ఉందన్నారు. మన జిల్లాలో ఉన్న ఏకైక పెద్దనగరం అన్నారు. కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు సహకరించాలని అన్నారు. జిల్లాను స్వచ్చ జిల్లాగా తీర్చిదిద్దేందుకు నగర వాసులు సహకరించాలని, ఈ దిశలో ప్రజా ప్రతినిధులు సహాకారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ సంకల్పప్రతి ఇంటికి తడి పొడి చెత్తను సేకరించేందుకు నగరపాలక సంస్థ రెండు డస్ట్ బిన్నులను అందించిందన్నారు. నగరవాసులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేరు వేరు డస్ట్ బిన్సులో వేసి పారిశుద్ద్య కార్మికులకు అందించి కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. దేశంలోనే రాజమహేంద్రవరంకు మంచి పేరుఉందని, అందరం కలిసి కట్టుగా పనిచేసి "స్వచ్చ రాజమహేంద్రవరం" సాధన లో భాగంగా స్వచ్చనగరంగా తీర్చిదిద్దుదామన్నారు. తొలుత క్లీన్ అండ్ గ్రీన్ లో భాగంగా కలెక్టరు స్వయంగా అధికారులతో కలసి చెత్త సేకరణ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. అందులో భాగంగా చెత్త సేకరణ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఇది ఆరంభం మాత్రమేనని , నిరంతర ప్రక్రియగా కొనసాగించేందుకు స్వీయ భాగస్వామ్యం
ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నరపాలక సంస్థ కమీషనర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా జిల్లాకలెక్టరు వారి నేతృత్వంలో స్వచ్చ సంకల్పం శ్రమదానం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. గత 15 రోజులుగా ఇంటింటి ప్రచారం ద్వారా ప్రజల్లో అవగాహన కోసం ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందరం చేయిచేయి కలిపి రాజమహేంద్రవరాన్ని చెత్త రహిత నగరంగాతీర్చి దిద్దుదామని కోరారు. కార్పోరేషన్ నుంచి ప్రతి ఇంటికి చెత్త సేకరణకు వాహనం వస్తుందని ఆవాహనం వొచ్చనప్పుడు మీఇంటి లోని తడి, పొడి చెత్తను విడివిడిగా ఇచ్చి సహరించాలన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలని అన్నారు.
కార్యక్రమంలో వివిధ స్వచ్చంద సంస్థలు, ఎన్జీవోలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆర్ఎంసి , ఇతరశాఖల అధికారులు, సిబ్బంది ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment