రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి గా బి.సత్య ప్రభాకర్ రావు బాధ్యతలు స్వీకరణ

 రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి గా బి.సత్య ప్రభాకర్ రావు బాధ్యతలు స్వీకరణ


.


అమరావతి,28 ఏప్రిల్ (ప్రజా అమరావతి); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా  బి.సత్య ప్రభాకర్ రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు.గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకులో ఆయన బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా 8వ అదనపు జిల్లా జడ్జిగా పనిచేస్తుండగా ప్రభుత్వం ఆయనను న్యాయ శాఖ కార్యదర్శిగా ఇటీవల నియమించడంతో సత్య ప్రభాకర్ రావు న్యాయశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.

ఈసందర్భంగా ఇప్పటి వరకు న్యాయశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహించిన వి.సునీత  న్యాయశాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్ రావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో న్యాయశాఖ కు చెందిన పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Comments