రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
వెలుగబంద గ్రామ సచివాలయం, అర్భికే ఆకస్మికంగా తనిఖీ చేసిన జేసీ
లబ్ధిదారుల వివరాలు ప్రదర్శించండి
.. జేసీ శ్రీధర్
ప్రజలకు, రైతులకు పారదర్శకంగా పరిపాలన సౌలభ్యం కోసం గ్రామ స్థాయిలో పరిపాలన వ్యవస్థ తీసుకుని రావడం జరిగిందని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు.
బుధవారం సాయత్రం రాజానగరం మండలం వెలుగుబంద గ్రామంలో అర్భికే, సచివాలయం లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జేసీ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉన్న అర్భికెలు, సచివాలయ వ్యవస్థ లో మెరుగైన పౌర సేవలు అందించాలన్నారు. ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్లు ద్వారా ఇంటి వద్దకే అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. కార్యదర్శి, సిబ్బంది ప్రతి ఒక్కరూ రికార్డ్స్ నిర్వహణ తప్పనిసరిగా నిర్వర్తించాలని స్ స్పష్టం చేశారు. విధుల్లో అలసత్యం విడనాడాలని, ఎప్పటి కప్పుడు అర్హులకు పథకాలు వర్తింపు చెయ్యడం లో నిబ్బద్దతతో కూడిన పనితీరు ప్రదర్శించాలని సూచించారు.
ఈ పర్యటనలో తహశీల్దార్ జీ. బాల సుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment