రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);
జిల్లా ఇంఛార్జి మంత్రి గా నియమితులైన రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ ను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఎస్పీ ఐశ్వర్యా రస్తోగి లు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చేం అందచేశారు.
శుక్రవారం జిల్లా యంత్రాంగం ప్రభుత్వం తరపున అధికారికంగా రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు కి మంత్రి హాజరయ్యారు.
తూర్పు గోదావరి జిల్లా కి ఇంఛార్జి మంత్రి గా నియమితులైన తరువాత మొదటసారి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమం "ఇఫ్తార్ విందు" కి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
జిల్లా ఇంఛార్జి మంత్రి కి స్వాగతం పలికిన వారిలో కలెక్టర్ , ఎస్పీ లతో పాటు జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, పలువురు అధికారులు తదితరులు ఉన్నారు..
addComments
Post a Comment